E-Paper
Advertisement

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!
Advertisement

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చేనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం హైదరాబాద్ వీడి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ అక్కడి స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ పనులకు సంబంధించిన ఫిర్యాదులు రావడమే ఆలస్యం.. వెంటనే నిధులు మంజూరు చేయడంతో పాటు పని పూర్తయ్యే అంతవరకూ మానిటరింగ్ చేసే బాధ్యతను సైతం స్థానిక లీడర్లపై సీఎం పెట్టనున్నట్టు తెలుస్తోంది.

పాలనపై పట్టు.. గుడ్ గవర్నెన్స్

రాష్ట్రంలోని ప్రజలకు మంచి పాలనను అందించే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులతో కలిసి ఆయన జిల్లాలు, పల్లెలకు పయనం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది? ఎక్కడైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? అని వివరాలు సేకరించనున్నారు.సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా? అధికారులు సరిగా స్పందిస్తున్నారా? లేక మౌలిక సదుపాయాలు కల్పన సరిగా జరుగుతున్నదా? లేదా అని మంత్రులతో కలిసి సీఎం సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా క్షేత్ర స్థాయిలో సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిని పూర్తి చేయాలని అటు అధికారులు,నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం.

Advertisement

ఇలా చేయడం ద్వారా పూర్తి స్థాయిలో పాలనపై పట్టుసాధించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.జనరల్ ఎలక్షన్స్‌కు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తేనే మరోసారి పార్టీకి అధికారం సాధ్యం అవుతుందని ఆయన అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. మరల స్కూల్స్ రీ ఓపెన్ అయ్యేలోపు అనగా 90 రోజుల పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి పరిష్కారం చూపనున్నట్టు తెలుస్తోంది.

CM Chandrababu: కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు.. నల్లమల సాగర్‌కు వాళ్లు సహకరించాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నెగెటివిటీని దూరం చేసేందుకు..

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటింది. నేటికి కొన్న చోట్ల సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలు అమలవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు హైడ్రా పేరిట అక్రమార్కుల గుండెల్లో ప్రభుత్వం రైళ్లను పరిగెట్టిస్తున్నది.కొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడిన వారిపైనా సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. అయితే, జిల్లాలతో పాటు నగరంలోని కొన్ని చోట్ల హైడ్రా చర్యలకు కొంత నెగెటివిటి ప్రచారం అధికంగా జరిగింది. సంక్షేమ పథకాలు రాలేదని కొందరు అధికార పార్టీని దూషిస్తున్నారు. వారికి అసలు విషయాలు చెప్పడంతో పాటు ప్రభుత్వం మీద సానుకూలత తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తున్నది. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం సాధించాలని, ఈ మేరకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లు కృషి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×