E-Paper
Advertisement

Telangana Elections : నేడే కాంగ్రెస్‌ మూడో లిస్ట్‌?.. కామారెడ్డి బరిలో రేవంత్‌?

Telangana Elections : నేడే కాంగ్రెస్‌ మూడో లిస్ట్‌?.. కామారెడ్డి బరిలో రేవంత్‌?
Advertisement

Telangana Elections : ఇప్పటికే వంద మందితో రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. మిగిలిన 19 మంది అభ్యర్థులతో మూడో లిస్ట్‌ను రిలీజ్‌ చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు మూడో లిస్ట్‌ను విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల విషయంలో కూడా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మూడో జాబితా ప్రకటన కాస్త ఆలస్యమైంది.

మరోవైపు సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనుండటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి నుంచి దూరమవుతున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్‌పై కూడా బలమైన నేతను బరిలోకి దించాలని చూస్తోంది కాంగ్రెస్‌.

Advertisement

మరోవైపు ఈరోజు కమ్యూనిస్టులతో ఫైనల్‌గా మరోసారి చర్చించనున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెప్పగా.. సీపీఐ మాత్రం కలిసి నడిచేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు తెలిపారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×