BigTV English

Congress: కాంగ్రెస్ బస్సుయాత్ర!.. త్వరలో ‘మహిళా డిక్లరేషన్’.. కేసీఆర్‌ ఇక ఫామ్‌హౌజ్‌కే!

Congress: కాంగ్రెస్ బస్సుయాత్ర!.. త్వరలో ‘మహిళా డిక్లరేషన్’.. కేసీఆర్‌ ఇక ఫామ్‌హౌజ్‌కే!
cong meet

Congress party news today(Telangana news live): కాంగ్రెస్ బాగా మారిపోయింది. మునుపటిలా గొడవలు, గ్రూప్ తగాదాలు తగ్గాయి. మనం మనం..అంటూ అంతా కలిసిపోతున్నారు. మార్పు మంచికే అంటున్నారు. లేటెస్ట్‌గా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలంతా వెళ్లారు. థాక్రే, జానారెడ్డి, రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నాల, పొంగులేటి, జూపల్లి.. ఇలా హేమాహేమీలంతా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై గంటల తరబడి చర్చించారు.


నాయకులంతా కలిసి ఉండాలని.. చిన్నచిన్న విభేదాలు ఉన్నా సర్దుకుపోవాలని అంతా కలిసి ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బస్సు యాత్ర’ చేపట్టాలనే అంశంపై చర్చించారు. జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు పెట్టాలని కూడా భావిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ-పీఏసీ మీటింగ్‌లో వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

పార్టీ తరఫున ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ కార్డు హామీలపై కీలక నిర్ణయం తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సర్కారులా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన రైతు రుణమాఫీ, వృద్ధులకు 4వేల పెన్షన్ హామీ తరహాలోనే.. కర్ణాటక మోడల్ గృహలక్ష్మి తదితర హామీలు ఇచ్చే అంశంపై చర్చించారు. ఇచ్చిన హామీలను ఇంటింటికీ ప్రచారం చేసేలా కార్యచరణ తయారు చేయనున్నట్టు చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి.


ఈ నెల 30న కొల్లాపూర్‌లో కాంగ్రెస్ సభ ఉంటుందని.. ప్రియాంక గాంధీ వస్తారని.. జూపల్లికి పార్టీ కండువా కప్పుతారని కోమటిరెడ్డి అన్నారు. ఆ సభలో ప్రియాంక గాంధీ.. మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు.

కాంగ్రెస్ నేతలమంతా అనేక కీలక అంశాలపై చర్చించామని.. అవన్నీ బయటకు చెబితే.. నాలుగు నెలల తర్వాత ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిన కేసీఆర్.. ఇప్పుడే ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోతారంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. అంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ఉంటుందని అన్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×