BigTV English

Komatireddy: తలసాని ‘విగ్గు రాజా’.. మా రేవంత్‌కి కోపం ఎక్కువ.. కోమటిరెడ్డి కసక్..

Komatireddy: తలసాని ‘విగ్గు రాజా’.. మా రేవంత్‌కి కోపం ఎక్కువ.. కోమటిరెడ్డి కసక్..

Komatireddy Venkat reddy latest news(Telangana politics): రేవంత్‌రెడ్డిని ఫుల్‌గా వెనకేసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీసీ నేతల మీటింగ్‌పై మండిపడ్డారు. మొత్తంగా కోమటిరెడ్డి ప్రత్యర్థులను ఓ ఆటాడుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…


కొంతకాలంగా రేవంత్‌రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ బీసీ లీడర్స్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ముందుగా మంత్రి తలసాని.. రేవంత్‌పై నోరు పారేసుకున్నారు. పొట్టోడు, పిసికేస్తే పోతాడు.. అంటూ ఏదోదో వాగాడు. అసలే రేవంత్.. తనను అన్నేసి మాటలు అంటే ఊరుకుంటారా? ఆయన సైతం పేడ పిసుక్కునేటోడు, బర్రెలు కడిగేటోడు, గుట్కాలు నమిలేటోడు.. అంటూ ఇచ్చిపడేశారు. అంతే. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ మరోరకంగా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. యాదవులను, బీసీలను కించపరిచారంటూ కొంతకాలంగా రచ్చ చేస్తోంది. తాజాగా, బీఆర్ఎస్ బీసీ నేతలంతా ప్రత్యేకంగా సమావేశమై రేవంత్-కాంగ్రెస్ తీరుపై చర్చించారు. ఈ విషయం ఎంపీ కోమటిరెడ్డి దృష్టికి రావడంతో.. ఆయన తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.

మా రేవంత్‌రెడ్డికి కోపం ఎక్కువ.. ఆయన్ను అంటే ఊరుకుంటాడా? అందుకే, తలసానిని అలా అన్నారంటూ వివరణ ఇస్తూనే.. కోమటిరెడ్డి సైతం మరో నాలుగు డైలాగులు దట్టించారు. తలసాని శ్రీనివాస్ ఓ విగ్గు రాజా అని.. ఎప్పుడూ నోట్లో పాన్ పరాగ్ ఉంటుందని.. మరింత ఇజ్జత్ తీసిపడేశారు. మా అధ్యక్షుడిని అంటే ఊరుకోమని హెచ్చరించారు కూడా.


బీసీలకు రేవంత్ ఏమీ అనలేదని.. అసలు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. తమ పార్టీలో అనేక మంది బీసీలకు ప్రముఖ స్థానం కల్పించామని అన్నారు. అన్నికులాలను గౌరవించే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

తాను కరెంట్ లాగ్ బుక్స్ బయటకు తీసే సరికి.. ప్రభుత్వం తోకముడిసిందని అన్నారు. తనకు భయపడి రాష్ట్రమంతా ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రైతు వేదికల దగ్గర నిరసన తెలుపుతామన్న బీఆర్ఎస్ నేతలు.. వారిని చెట్లకు కట్టేయాలంటూ రేవంత్ ఇచ్చిన పిలుపునకు భయపడి.. భయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. ఇలా వెంకట్‌రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఇదికదా కావాల్సింది.. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం.. హస్తం నేతల్లో సంతోషం నింపుతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×