E-Paper
Advertisement

NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!
Advertisement

NEET Protest: స్వేచ్చ బ్యూరో:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌లో కాంగ్రెస్ నాయకులు బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు.

రాజీనామా చేయాలని డిమాండ్..

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: చామన ఛాయ లేదా నల్లగా ఉండే వారికి మ్యాచింగ్ కలర్స్.. ఈ 7 కలర్ డ్రెస్‌లతో రాయల్ లుక్

ఈ కార్యక్రమంలో..

ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, బాల్ రెడ్డి, అధికార ప్రతినిధి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బీపీటీ రాజు, కిష్టాపూర్–గుండ్ల పోచంపల్లి–మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు చాప రాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముందిరాజ్, డబిల్‌పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు విఘ్నేశ్వర్ రెడ్డి, మేడ్చల్ మాజీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ వైస్ ఛైర్మెన్ రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

Related News

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×