BigTV English

AP Liquor: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

AP Liquor: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

AP Liquor Policy Notification: మద్యంప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం దుకాణాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఏపీ ఎఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రెండేళ్ల కాలపరిమితితో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఖరారు చేయనుంది.


ఏపీలో మొత్తం 3,396 మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు నేటి నుంచి దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు రుసుం రూ.2లక్షలుగా కేటాయించారు. ఇందులో ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఈ దరఖాస్తులను అక్టోబర్ 9 వరకు స్వీకరించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 11న మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది. దీంతో ఈనెల 12 నుంచే మద్యం దుకాణాలను ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, కొత్తగా లైసెన్స్‌లు పొందే దుకాణాలకు ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు.


Related News

Village Clinics: ఏపీలో వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్‌

YSRCP: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

Big Stories

×