E-Paper
Advertisement

Nalgonda District: ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక.. కీలక నేతల గుండెల్లో గుబులు

Nalgonda District: ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక.. కీలక నేతల గుండెల్లో గుబులు
Advertisement

Nalgonda District: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా నల్లగొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లా లోని మున్సిపాలిటీలో 162 వార్డులు ఉండగా 106 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వటజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా కీలకమైన మున్సిపల్ చైర్ పర్సన్ చైర్మన్ మేయర్ ఎన్నికలను అధికారులు ఈనెల 16న నిర్వహించనున్నారు.

మేయర్ ఎన్నిక లాంఛనమే..

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేయించిన రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతోపాటు 32 వ వార్డు అభ్యర్థిగా గెలిచినటువంటి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. 27 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సక్సెస్ అయ్యారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా ఇప్పటికే బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని మేయర్ గా డిక్లేర్ చేసిన నేపథ్యంలో మేయర్ ఎన్నిక లాంఛనం కానుంది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 11 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. హాలియా మునిసిపల్ చైర్మన్ జనరల్ కాగా 7వ వార్డు నుంచి గెలిచిన చింతల చంద్రారెడ్డి హాలియా చైర్మన్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్టగా తెలుస్తోంది.

చండూరు మున్సిపాలిటీలో..

Advertisement

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 9 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా పందిరి గీత చైర్మన్ రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 6 వార్డులను గెలుచుకోగా మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానం గెలుచుకుంది. అయితే చండూరు మున్సిపాలిటీ జనరల్ కేటాయించగా చైర్మన్ గా కోడి శ్రీనివాసులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దేవరకొండ మున్సిపాలిటీలో 20 స్థానాలకు 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దేవరకొండ మున్సిపాలిటీ బీసీ మహిళ కు రిజర్వు కాగా పున్న శైలజ వెంకటేశ్వర్లను చైర్మన్‌గా ఎన్నిక చెయనున్నట్లు తెలుస్తోంది. నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాగా నందికొండ మున్సిపాలిటీ ఎస్సీ జనరల్‌కు కేటాయించగా 12వ వార్డుకు చెందిన మానస స్వర్ణ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక

Advertisement

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఆరు మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ ఎన్నిక వ్యవహారం సానుకూలంగా ఉండగా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డుల్లో 31 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా 17వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచిన నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, 40 వ వార్డు శాంతినగర్ నుంచి గెలిచిన మిట్టపల్లి శ్రీదేవి, 41 వ వార్డు ఎన్ఎస్ పీ క్యాంప్ నుంచి గెలిచిన గుడిపాటి శిరీష నవీన్, 31 వ వార్డు బంగారుగడ్డ నుంచి గెలిచిన చిలుకూరి సుధా బాలకృష్ణ చైర్మన్ రేస్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతుండగా ఎస్సీ లకు చైర్మన్ గా అవకాశం ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

మిర్యాలగూడలో కాంగ్రెస్..

రాజకీయంగా ప్రభావితం చేయగల ఈ కీలక నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసిండ్రు. అయితే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పార్టీని నడిపించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంట ముఖ్య అనుచరులుగా గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలు వార్డులను గెలుచుకునేందుకు కృషిచేసిన ప్రస్తుత డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉన్న నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణుల్లో మిర్యాలగూడ చైర్మన్ ఎవరికి ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది ఈనెల 16న జరిగే చైర్మన్ ఎన్నిక వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×