Congress Strategy: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. కేవలం ఒక పార్టీని కాకుండా, అటు కేంద్రంలోని బీజేపీ(BJP)ని, ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్(BRS)ను ఏకకాలంలో దెబ్బతీసేలా ‘డబుల్ ఎటాక్’ వ్యూహాన్ని అమలు చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది.ఇందుకోసం పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్(Youth Congress), ఎన్‌ఎస్‌యూఐ(NSUI) మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ వంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు ఇకపై వీధుల్లోకి రావాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్లి రెండు పార్టీల వైఫల్యాలను ఎండగట్టాలని సూచించింది.
రెండు పార్టీలను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం కావాలని సూచించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ప్రాజెక్టుల వైఫల్యాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ‘అన్యాయం’పై ఆధారాలతో సహా రికార్డులు సిద్ధం కావాలని పార్టీ ఆదేశించింది. ఇక విభజన హామీల అమలులో బీజేపీ నిర్లక్ష్యాన్ని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ తీరును ప్రజల ముందు ఉంచడంతో పాటు రెండు పార్టీల మధ్య ఉన్న ‘లోపాయికారీ ఒప్పందాలను’ ఎండగట్టడం ద్వారా, రెండు పార్టీలు ఒకటే అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
Also Read: ఉదయం కేవలం 10 నిమిషాలు సూర్యనమస్కారం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఇలా చేయండి
ప్రతి గ్రామంలోనూ, సోషల్ మీడియా(Social Media) వేదికగానూ ఈ రెండు పార్టీల వైఫల్యాలను “పబ్లిక్ డొమైన్” లోకి తీసుకురావాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
బీజేపీ మతతత్వంతో, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలతో రాష్ట్రాన్ని వంచిస్తున్నాయి అంశాన్ని మరోసారి బలంగా జనాల్లోకి తీసుకువెళ్లనున్నారు . ఈ రెండు పార్టీల వైఫల్యాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే తమ లక్ష్యం అంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.తెలంగాణ రాజకీయ క్షేత్రంలో త్రిముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా పావులు కదుపుతోంది.
2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లపాటు ఆ పవర్ ను కంటిన్యూ చేయాలని బలంగా ఆశిస్తున్నది. ఇందులో భాగంగానే బిజెపి బీఆర్ఎస్ పార్టీలను ప్రజల్లో మరింత చులకనగా చేసేందుకు ప్రత్యేకమైన ప్లాన్లను అమలు చేయాలని టిపిసిసి నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ వైఫల్యాలతో పాటు, ఆయా పార్టీల లోని కీలకమైన వ్యక్తుల లూప్ లైన్స్ , నిర్లక్ష్యం, అవినీతి, వంటి అంశాలన్నీ తెరమీదకు తీసుకొచ్చి పార్టీతోపాటు చేయాలని కాంగ్రెస్ వ్యూహంతో ముందుకు సాగనున్నది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముక పోటీ నెలకొన్న నేపథ్యంలోనే.. ఈ దఫా రెండు పార్టీలను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ సిద్ధమైంది.
Also read: పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!