E-Paper
Advertisement

పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!

పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!
Advertisement

Inter Admissions: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సులకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని తెలిపారు.

అందుబాటులో 40 సీట్లు..

ఈ ప్రవేశాల ద్వారా ఎంపీసీ(MPC), బైపీసీ(BOPC), సీఈసీ(CEC)తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపులోనూ 40 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పాత ఎంఈసీ గ్రూప్ స్థానంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఏసీఈ గ్రూపును తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also read: సినిమాలను డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలుసా..?

మే 27న మెరిట్..

అధికారిక వెబ్‌సైట్ telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మే 27న మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారని, మే 28 నుంచి 30 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Advertisement

Also read: సమ్మర్ క్యాంప్ లో పిల్లల ప్రాణాలు తీస్తున్న ముసుగు హంతకుడు… ఊపిరి బిగబట్టేలా చేసే హారర్ సినిమా

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×