E-Paper
Advertisement

Telangana Election Results : పార్టీ ఫిరాయించిన నేతలకు షాక్.. అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ గెలుపు..

Telangana Election Results : పార్టీ ఫిరాయించిన నేతలకు షాక్.. అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ గెలుపు..
Advertisement

Telangana Election Results : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ 70 స్థానాలు కచ్చితంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో తొలి విజయం కాంగ్రెస్ రకే దక్కింది. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 20 వేలపైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.

2018లో అశ్వారావుపేటలో టీడీపీ తరఫున పోటీ చేసి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఓటమిపాలయ్యారు.

Advertisement

రెండో విజయం కూడా కాంగ్రెస్ అభ్యర్థినే వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (ఎస్టీ) స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య .. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై 38 వేల మెజార్టీతో గెలుపొందారు.

హరిప్రియా నాయక్ కాంగ్రెస్ నుంచి 2018లో గెలిచారు. ఆ తర్వాత ఆమె పార్టీ ఫిరాయించి గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలోనే ఆమె ఓటమి చవిచూశారు. ఇలా 2018లో గెలిచిన పార్టీ నుంచి కారెక్కిన ఇద్దరు నేతలకు ప్రజలు ఓటమిని కానుకగా ఇచ్చారు.

Advertisement

రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×