E-Paper
Advertisement

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!

Corruption Cases: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దారుణంగా పెరిగి పోయిన అవినీతి.. ఇదిగో లెక్కలు..!
Advertisement

Corruption Cases: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌రువాత ప్ర‌భుత్వ పాల‌న‌లో అవినీతి పెరిగిపోయిందని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ అధ్య‌క్షుడు ప‌ద్మ‌నాభ‌రెడ్డి అన్నారు. త‌ప్పు చేస్తే శిక్ష‌ప‌డుతుంది అన్న భ‌యం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌లో ఏ కోశాన లేదని, ఏ.సీ.బీ., విజిలెన్స్ శాఖ‌లు విచార‌ణ జ‌రిపి ప్ర‌భుత్వానికి పంపిన నివేదిక‌ల‌పై చ‌ర్య‌లు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంగళవారం లేఖ రాశారు. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన లేక ఆశ్రిత ప‌క్ష‌పాతం, బంధు ప్రీతితో ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకున్న రిపోర్టులు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎటువంటి చ‌ర్య‌లు లేక స‌చివాల‌యంలో ప‌డి ఉన్నాయి. పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. విజిలెన్స్ రిపోర్టుల‌ను ఏదో ఒక వంక‌తో సాగ‌దీసి చివ‌ర‌కు చిన్న ప‌నిష్మెంట్ లేదా కేసు డ్రాప్ చేయ‌డం జ‌రుగుతుందన్నారు.

విజిలెన్స్ కేసులు 129 కాగా..

రాష్ట్ర స‌చివాల‌యంలో ఏ.సీ.బీ., విజిలెన్స్ శాఖ‌ల రిపోర్టుల‌పై త‌గిన చ‌ర్య‌లు గైకొన‌డం లేదన్నారు. రెవెన్యూ శాఖ‌లో మొత్తం 323 ఏసీబీ కేసులు ఉండ‌గా అందులో 5 కేసులు మాత్ర‌మే డిస్పోజ్ అయి మిగిలిన 318 కేసులు వివిధ ద‌శ‌ల‌లో ప‌రిశీల‌న‌లో ఉన్నాయన్నారు.(ఈ 323 కేసుల‌లో చాలా వరకు 10ఏళ్ల క్రితం న‌మోదైన కేసులు). ఇక విజిలెన్స్ కేసులు 129 కాగా అందులో నుంచి 8 కేసులు మాత్ర‌ము డిస్పోజ్ అయి మిగ‌తా 121 కేసులు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప‌రిశీల‌న‌లో ఉన్నాయన్నారు. ఏసీబీ అధికారులు ప్ర‌తిరోజు ఏదో ఒక చోట కేసులు న‌మోదు చేస్తున్నారన్నారు.

Advertisement

Also Read: Chai Wala: సెన్సార్ దెబ్బకి టైటిల్ మార్చేశారు.. న్యూ టైటిల్ ఇదే!

లంచాలు ఇంకా ఎక్కువయ్యాయి..

అవినీతి అధికారుల ఇళ్ల సోదాలు చేసిన‌ప్పుడు పెద్ద ఎత్తున డ‌బ్బు, ఆస్తులు ప‌ట్టుబ‌డుతున్నాయని, దీంతో ప్రసార మాధ్య‌మాలు హైలైట్ చేస్తున్నాయన్నారు. దీనితో ప్ర‌జ‌లు, ఏసీబీ ప‌నిని ప్ర‌శంసిస్తూ అవినీతి అధికారులకు శిక్ష ప‌డుతుంద‌ని ఇక వారికి లంచాల బెడ‌ద త‌ప్పుతుంద‌ని భావిస్తున్నారన్నారు. అయితే లంచాలు త‌గ్గ‌క‌పోగా ఇంకా ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి అధికారులు ఏసీబీకి ఒక‌టి కంటే ఎక్కువ సార్లు ప‌ట్టుబ‌డ్డ ఉదంతాలు ఉన్నాయన్నారు. పాల‌న‌లో అవినీతి గురించి గ‌తంలో సీఎంకి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సంబంధిత శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు లేఖ‌లు రాయ‌డం జ‌రిగిందన్నారు. ఇంత‌వ‌ర‌కు దీనిపై ఎటువంటి చ‌ర్య‌లు లేవు అని, దీనితో ప్ర‌భుత్వానికి కూడా చెడ్డ‌పేరు వ‌స్తుందన్నారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులు త్వరగా ప‌రిష్కార‌మ‌య్యేలా, అలాగే అవినీతి అధికారులకు శిక్ష ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎంను కోరారు.

Advertisement

Also Read: Toxic film: మరో వివాదంలో యశ్ టాక్సిక్.. నిర్మాతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు..

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×