BigTV English

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : మునుగోడు మూగబోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఎక్కడివారక్కడే గప్ చుప్. బయటి వాళ్లకి బై బై చెప్పేసి.. స్థానికులు నోట్ల వేటలో బిజీ అయ్యారు.


పార్టీలకు పోటీగా ఎన్నికల సంఘం, పోలీసులు సైతం వేటకు రెడీగా ఉన్నారు. పోలీసులు మునుగోడు నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధనం చేసేశారు. సరిహద్దుల్లో వంద చెక్ పోస్టులు పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం 6 నుంచి తనిఖీలు పెంచేశారు. వాహనాల సోదాలతో పాటు ప్రతీ ఇంటిని జల్లడపట్టే పనిలో ఉన్నారు.

105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది ఈసీ. 3వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను తరలించింది. మంగళవారం పలివెలలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు దాడులకు తెగబడటంతో మరిన్ని అదనపు బలగాలను మునుగోడుకు తరలిస్తోంది ఎన్నికల సంఘం. 200 పోలీస్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అక్రమ నగదుపై కన్నేసి ఉంచడానికి ఐటీ టీమ్స్ రెడీగా ఉన్నాయి.


మంగళవారం సాయంత్రం ప్రచార సమయం ముగిశాక.. బయటి వారెవరూ నియోజకవర్గంలో ఉండకూడదు. ప్రధాన మీడియాతో పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలోనూ ఎలాంటి ప్రచారం చేయకూడదు. బల్క్ మెసేజ్ లపై నిషేధం ఉంది.

మునుగోడులో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51 బృందాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ ఎలా జరుగుతుందోననే టెన్షన్ టెన్షన్..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×