Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు ఓ కేసులో యూపీలోని రాయ్‌బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో ప్రస్తావించింది. ఇంతకీ ఈ కేసు విషయంలో అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్ నెలలో జరిగింది. ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎంపీగా అసరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ తన ప్రమాణ స్వీకారాన్ని ముగించారు.
దీన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయవాది వీరేంద్రగుప్తా. చట్టసభలో జై పాలస్తీనా అనే నినాదాలు రాజ్యాంగ, న్యాయ సూత్రాలను ఒవైసీ ఉల్లంఘించారన్నది ప్రధానంగా ప్రస్తావించారు పిటిషనర్. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎంపీకి నోటీసులు జారీ చేసింది.
ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. జై పాలస్తీనా నినాదాలు రాజ్యాంగ విరుద్దమని మీడియా లేవనెత్తింది. అది రాజ్యాంగానికి ఎలా వ్యతిరేకమో, అందుకు సంబంధించి నిబంధనను చూపించాలన్నారు. జై పాలస్తీనా నినాదానికి గల కారణాలు చెప్పారు.
ALSO READ: అల్లు అర్జున్ ఇష్యూ.. పీసీసీకి సీఎం సూచనలు
వహా కీ ఆవామ్ మహ్రూమ్ హై (అక్కడ చాలామంది ప్రజలు నిరుపేదలు) పాలస్తీనాకు సంబంధించి మహాత్మాగాంధీ చాలా విషయాలు చెప్పారని ప్రస్తావించారు. అదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గతేడాది అక్టోబర్ నుండి దాదాపు 45 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. లక్షకు పైగానే గాయపడ్డారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో కనీసం 1000 మంది మరణించారని, 200 మందికి పైగా బందీలుగా తీసుకున్నారంటూ అల్ జజీరా ఛానెల్ పేర్కొన్న విషయం తెల్సిందే.