BigTV English

Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవల్లో మరో ట్విస్ట్.. పక్కా ప్లాన్ తో మనోజ్ స్కెచ్ ?

Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవల్లో మరో ట్విస్ట్.. పక్కా ప్లాన్ తో మనోజ్ స్కెచ్ ?

Manchu Manoj : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలిలో జరుగుతున్న వివాదాల గురించి అందరికి తెలిసిందే.. ఈ గొడవలతో ఇన్నేళ్లు కాపాడుకుంటూ వచ్చిన మంచు ఫ్యామిలీ పరువు మొత్తం పోయిందనే చెప్పాలి. తండ్రి కొడుకుల మధ్య ఆస్తి గొడవలు మొదలైనట్లు ఇటీవల ఒకరిమీద మరొకరు పోలీస్ కేసు పెట్టడంతో అందరికి తెలిసిందే. మంచు మనోజ్ ముందుగా తన తండ్రి వల్ల తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మోహన్ బాబు కూడా తన కొడుకుపై కేసు పెట్టాడు. మంచు వారి ఇంట ఇపుడు నడుస్తున్న కాంట్రవర్సీలో ఒక్క మంచు లక్ష్మి తప్ప మిగతా కుటుంబీకులు అంతా కూడా ఈ ఇష్యూ పైనే మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో రీసెంట్ గానే మోహన్ బాబు మీడియా వారిపై దాడి చేయడంతో ఆయన పై హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ కేసులో ఆయనకు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని తెలుస్తుంది. ఇక తాజాగా మనోజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.


మంచు విష్ణు vs మంచు మనోజ్ నడుమ వాగ్వాదాలు ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. గత కొన్ని వారాలు కితమే మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు తన ఇంటికి వచ్చి జెనరేటర్ లో పంచదార పోసి కరెంట్ కట్ చేసాడు అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అందులో ఎటువంటి నిజం లేదని మనోజ్ తల్లీ నిర్మల క్లారిటి ఇచ్చారు. అంతేకాదు తన సొంత కొడుకుపై రివర్స్ కంప్లైంట్ ఇచ్చింది. తాజాగా మంచి ఫ్యామిలీ గొడవల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా తన అన్నయ్య మంచు విష్ణు నుంచి నాకు ప్రాణ హాని ఉందంటూ మంచు మనోజ్ కంప్లైంట్ చేసాడట. మంచు విష్ణు సహా మరో వ్యక్తి పేరు కూడా తాను పెట్టినట్టుగా తెలుస్తుంది.. అది ఎవరో కాదు మొదటి నుంచి వివాదాలకు కారణం అయిన వినయ్ పేరు కూడా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మీద మనోజ్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది..

ఏది ఏమైనా మంచు ఫ్యామిలీ గొడవలు మరోసారి యూటర్న్ తీసుకున్నాయి. ఆస్తుల కోసం గొడవలు పడాల్సిన అవసరం అయితే మనోజ్ కు లేదు. ఎందుకంటే తన భార్య మౌనిక పేరు మీద చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఇంకేదో ఉందని కొందరు ప్రముఖులు తీవ్రమైన చర్చలు చేస్తున్నారు. మంచు వారి కలహాలు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో అనేది చూడాలి.. ఇక మంచు విష్ణు ఇపుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” షూటింగ్ లో బిజీగా ఉండగా ఆ సినిమా పనులు ఓ పక్క ఈ గొడవలు మరోపక్క హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీని మోహన్ బాబే స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక మంచు విష్ణు కూడా ఈ గొడవలు కాకుండా పలు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో రీసెంట్ గానే భైరవం అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక మంచు లక్ష్మీ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల పై కనీసం స్పందించలేదు.. నేడు మోహన్ అరెస్ట్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎం జరుగుతుందో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×