BigTV English

Train Ticket Discount: రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. వెంటనే మీరూ బుక్ చేసుకోండి!

Train Ticket Discount:  రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. వెంటనే మీరూ బుక్ చేసుకోండి!

Namo Bharat Train Ticket Discount: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇకపై నమో భారత్ రైలు టికెట్ ధరలపై 10 శాతం రాయితీ అందించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం NCRTC(National Capital Region Transport Corporation) తన ప్రయాణీకుల కోసం లాయల్టీ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘RRTS కనెక్ట్’ మోబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ లాయల్టీ పాయింట్లు అంటే ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


లాయల్టీ పాయింట్లు ప్రోగ్రామ్ అంటే..   

NCRTC లాయల్టీ పాయింట్ల కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైలు టికెట్ కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక పాయింట్ లభిస్తుంది. దాన్ని లాయల్టీ పాయింట్ అంటారు. ప్రతి లాయల్టీ పాయింట్ విలువ 10 పైసలు. ఇది ప్రయాణీకుల ‘RRTS కనెక్ట్’ అకౌంట్ లో యాడ్ అవుతుంది. ఈ డబ్బులతో నమో భారత్ టికెట్లు కొనే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో ప్రయాణీకులకు డబ్బులు ఆదా కానున్నాయి.


డిజిటల్ టికెటింగ్ బూస్ట్

NCRTC తీసుకొచ్చిన లాయల్టీ పాయింట్ల ద్వారా ప్రయాణీకులకు చాలా మేలు కలగనుంది. అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం ‘RRTS కనెక్ట్’ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. ఈ విధానం ద్వారా QR టిక్కెట్ల వాడకం పెరుగుతుంది. పేపర్‌ లెస్ టికెటింగ్ ద్వారా ప్రయాణ విధానం కూడా మరింత ఈజీ అవుతుంది. పర్యావరణానికి మేలు కలగడంతో పాటు వేగంగా, సులభం, సురక్షితంగా టికెట్లను పొందే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఈజీ ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు NCRTC ప్రయత్నిస్తోంది.

కొత్త వినియోగదారులకు 500 లాయల్టీ పాయింట్లు

ఇక ‘RRTS కనెక్ట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నన ప్రతి వినియోగదారుడికి 500 లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. అంటే వీటి విలువ రూ. 50 ఉంటుంది. ఇప్పటికే ‘RRTS కనెక్ట్’ యాప్ ఉన్నవాళ్లు ఇతరులకు రికమండ్ చేయడం వల్ల అదనంగా లాయల్టీ పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది.  కొత్త వినియోగదారులు 500 లాయల్టీ పాయింట్లు వచ్చినట్లుగానే, రిఫరర్ కు కూడా రూ. 50కి సమానమైన 500 లాయల్టీ పాయింట్లను పొందుతారు. ఇవి కూడా ‘RRTS కనెక్ట్’ అకౌంట్ లో యాడ్ అవుతాయి. టికెట్ కొనుగోలు లేదంటే రిఫర్ చేసి సంపాదించిన లాయల్టీ పాయింట్లు క్రెడిట్ డేట్ నుంచి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతాయి. ఇక ‘RRTS కనెక్ట్’ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగల్ ప్లే స్టోర్ నుంచి.. ఐ ఫోన్ వినియోగదారులు ఆపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: జస్ట్ 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఎప్పుడంటే!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×