Covid 19: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ గా చెబుతున్న జేఎన్1 వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.
తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టుల నిర్వహించడంతో ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఆ వృద్ధురాలు సుంకరి యాదమ్మ(65) మాత్రం ఎంజీఎంలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. యాదమ్మ కుటుంబ సభ్యులు.. భాస్కర్ (42), వీణ(30), ఆకాష్ (13), మిద్దిని(5) లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 50 పాజిటివ్ కేసులున్నాయి.