BigTV English

TikTok:- టిక్‌టాక్‌కు భారీ ఫైన్.. ఎందుకంటే..?

TikTok:- టిక్‌టాక్‌కు భారీ ఫైన్.. ఎందుకంటే..?

TikTok:- సోషల్ మీడియా అనేది యూజర్ల ప్రైవసీకి తీవ్ర భంగం కలిగిస్తుందని ఇప్పటికే చాలామంది ఆధారాలతో సహా నిరూపించారు. కొందరు యూజర్లు తమ ప్రవైసీకి భంగం కలుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని పలు సోషల్ మీడియా యాప్స్‌పై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. తాజాగా మరో సోషల్ మీడియా యాప్‌పై కూడా కేసు తప్పలేదు. దీంతో ఆ యాప్‌కు భారీ ఫైన్‌ను విధించింది కోర్టు. ఆ యాప్ మరేదో కాదు.. టిక్ టాక్.


ఈరోజుల్లో చిన్నపిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. వారికి ఏది తప్పు, ఏది కరెక్ట్ అని తెలియకపోవడంతో కొందరు పిల్లలు ఆ సోషల్ మీడియా యాప్స్‌ను తప్పుగా ఉపయోగించడం మొదలుపెడుతున్నారు. అయితే చిన్నపిల్లల కోసం టిక్ టాక్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం లేదని యూజర్లు చెప్తున్నారు. అండర్ ఏజ్ పిల్లలు తమ యాప్ ఉపయోగించకుండా ఉండేలా టిక్ టాక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని, అంతే కాకుండా డేటా విషయంలో కూడా టిక్ టాక్ అశ్రద్ధ వహిస్తుందని అన్నారు.

టిక్ టాక్ చేస్తున్న తప్పులకు ఫైన్‌గా 12.7 మిలియన్ యూరోలను కట్టాలని ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ (ఐసీఓ) ఆదేశాలు జారీ చేసింది. 2020లో ఈ యాప్ యాజమాన్యం 13 కంటే తక్కువ వయసున్న పిల్లలు తమ యాప్ వినియోగించేలా చేసిందని ఐసీఓ వెల్లడించింది. ఇది ఐసీఓ రూల్స్‌ను అతిక్రమించడం లాంటిదే అని తెలిపింది. ముందుగా టిక్ టాక్‌కు 27 మిలియన్ యూరోల ఫైన్‌ను విధించాలని ఐసీఓ నిర్ణయించుకున్నా ఆ తర్వాత అది 12.7 మిలియన్ యూరోలకు తగ్గింది.


తమపై వస్తున్న ఆరోపణలను టిక్ టాక్ ఖండించలేదు. వారి పర్ఫార్మెన్స్‌లో కొన్ని లోట్లు ఉన్నాయని, యూజర్లు చెప్పేది వారు పరిగణిస్తామని తెలిపింది. అండర్ ఏజ్ వారికి స్పెషల్ కేటగిరిని అందించకపోవడం తమ తప్పే అని ఒప్పుకుంది. ఇటీవల ఎడ్యుకేషన్ కోసం టిక్ టాక్ ఒక ఫీచర్‌ను లాంచ్ చేసింది. అందులో రాజకీయ అభిప్రాయలను, మత నమ్మకాలను, టెక్నాలజీకి సంబంధించిన డేటాను, హెల్త్ డేటాను ఎవరైనా పంచుకునేలా అవకాశాన్ని అందించింది. కానీ అండర్ ఏజ్ వారికోసం మాత్రం ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది.

బయట ప్రపంచంలో తమ పిల్లల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. డిజిటల్ వరల్డ్‌లో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఐసీఓ తెలిపింది. దాదాపు 1 మిలియన్ 13 కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచారాన్ని టిక్ టాక్ సేకరించిందని బయటపెట్టింది. వారు స్క్రోల్ చేస్తున్నప్పుడు వారి వయసుకు తగిన వీడియోలు చూపించాలనే కనీస జాగ్రత్తను టిక్ టాక్ పాటించలేదని చెప్పింది. ఈ ఫైన్‌తో అయినా టిక్ టాక్ తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించింది.

అమెజాన్‌పై ప్రైవసీ కేసు.. అలెక్సానే కారణం..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×