BigTV English

Crime: నవీన్‌ను ముక్కలుగా నరికి లవర్‌కు ఫోటోలు పంపిన హరి.. ఓకే అంటూ అమ్మాయి రిప్లై..

Crime: నవీన్‌ను ముక్కలుగా నరికి లవర్‌కు ఫోటోలు పంపిన హరి.. ఓకే అంటూ అమ్మాయి రిప్లై..

Crime: హరహరకృష్ణ. దేవుడి పేరు పెట్టుకుని రాక్షసుడిలా ప్రవర్తించాడు. లవర్ కోసం ఉన్మాదిలా మారాడు. తన ప్రేమకు పోటీగా వచ్చాడనే ఆక్రోశంతో స్నేహితుడు నవీన్‌ను దారుణంగా చంపేశాడు.


ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో ఆ వేలు ఇదేనంటూ నవీన్ వేలును కోసి ఆ ఫోటో అమ్మాయికి వాట్సాప్ చేశాడు హరి.

ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసి ఆ ఫోటోనూ పంపాడు.


ఈ గుండెనే కదా నిన్ను టచ్ చేసింది.. అంటూ నవీన్‌ గుండెను బయటకు తీసి లవర్‌కు ఆ ఫోటో సెండ్ చేశాడు.

మర్మంగాలూ కట్ చేశాడు. నవీన్ తలను వేరు చేసి దూరంగా పడేశాడు.

హర హర కృష్ణ పంపిన వాట్సాప్ మెసేజ్‌లు చూసిన అమ్మాయి.. అవునా.. ఓకే.. అంటూ రిప్లై ఇవ్వడం సంచలనం.

కలకలం రేపిన నవీన్ హత్య కేసులో అమ్మాయి పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

నిందితుడు హరహర కృష్ణపై.. 302, 201, 3(2)(v), ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అబ్దుల్లాపుర్‌మెట్ పోలీసులు.

నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో నవీన్, హరి ఇంజనీరింగ్ EEE ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వీరి మధ్య గొడవ మొదలైంది.

ఈనెల 17న పార్టీ చేసుకుందామంటూ అబ్దుల్లాపుర్‌మెట్‌లోని ఫ్రెండ్‌ రూమ్‌కి నవీన్‌ను రప్పించాడు హరి. ఇద్దరూ మద్యం తాగి.. అమ్మాయి విషయంలో మళ్లీ గొడవ పడ్డారు.

నవీన్‌, హరిలు కొట్టుకున్నారు. కిందపడిపోయిన నవీన్‌ను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.

తనతో తెచ్చుకున్న కత్తితో నవీన్ మర్మాంగాలను, వేలు, పెదాలు కోసేశాడు. చాతిని చీల్చి గుండెను బయటకు తీసి దారుణంగా చంపేశాడు. తల, మొండెం వేరు చేశాడు.

కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో నవీన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి.. స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు హరహరకృష్ణ.

నవీన్‌ను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు హరి. 3 నెలల కిందటే నవీన్‌ హత్యకు ప్లాన్‌ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

క్రైమ్ వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు చూసి మర్డర్ ఎలా చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. రెండు నెలల క్రితమే కత్తి కొని.. బండిలో పెట్టుకున్నాడు. హత్య చేసే సమయంలో చేతులకు గ్లౌజెస్ వేసుకుని కత్తితో నరికి చంపాడు. హరి మానసిక స్థితిపైనా ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఢిల్లీలో అమ్మాయిలపై జరిగిన వరుస హత్యల తరహాలోనే నవీన్ మర్డర్ కూడా ఉండటంతో.. వాటి ప్రభావం నిందితుడిపై ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

Tags

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×