E-Paper
Advertisement

Sonia Gandhi: రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్‌బై.. ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటన..

Sonia Gandhi: రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్‌బై.. ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటన..
Advertisement

Sonia Gandhi: సోనియా గాంధీ. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ అధినేత్రి. వయసు మీదపడినా, ఆరోగ్యం సహకరించకపోయినా.. కాంగ్రెస్ బరువుబాధ్యతలు మోస్తూ వచ్చారు. ఇప్పుడు రాయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటించారు.

భారత్ జోడో యాత్రతో తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారు సోనియా. జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అన్నారు. 1998లో ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించానని.. 25 ఏళ్లలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశానని చెప్పారు.

Advertisement

మన్మోహన్ సింగ్‌తో కలిసి 2004, 2009లో అందించిన యూపీఏ పాలన తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌కి, దేశానికి 2024 ఎన్నికలు పరీక్ష లాంటివన్నారు సోనియా గాంధీ.

మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. దేశంలో ఆ పార్టీ విద్వేషాలను రగిలిస్తోందని మండిపడ్డారు. మైనారిటీలు, మహిళలు, దళితులే, గిరిజనులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కొంతమంది వ్యాపారుల కోసం ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని సోనియా విమర్శించారు.

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×