E-Paper
Advertisement

Hyderabad drugs news : గంజాయి మత్తులో దారుణాలు.. హైదరాబాద్ లో వరుస ఘటనలు..

Hyderabad drugs news : గంజాయి మత్తులో దారుణాలు.. హైదరాబాద్ లో వరుస ఘటనలు..
Advertisement
Hyderabad drugs news

Hyderabad latest news telugu(Telangana news today):

హైదరాబాద్‌లో రోజురోజుకు గంజాయి ప్రభావిత ఘటనలు పెరిగిపోతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా నగరంలో అందుబాటులో ఉండటంతో.. యువకులు మత్తుకు బానిసలవుతున్నారు. ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండానే దారుణాలకు ఒడిగడుతున్నారు. గంజాయితోపాటు, యువత మద్యానికి బానిసల కావడం కలవరపెడుతోంది. నగరంలో జరుగుతున్న చాలా నేరాల ఘటనలకు ఇవే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందుకు తాజగా జరిగిన ఘటనలే అద్దం పడుతున్నాయి.

తాజాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 14 ఏళ్ల మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఈ ఘటనకు గంజాయి మత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలతో కలిసి బయట ఆడుకుంటుండగా.. ఇంటిలోకి లాక్కెళ్లారు. ఎనిమిది మంది నిందితుల ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ ముఠాలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టి భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారులను బెదిరించారు.పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆ బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించారు.

Advertisement

ఇలాంటి ఘటన మరోఒకటి. .సికింద్రాబాద్‌లో చోటుచేసుంది. జవహర్ నగర్‌లోని చంద్రపురి కాలనీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి ఇంటిపై దాడిచేసి అతన్ని చితకబాదారు. దాస్ అనే వ్యక్తి కళ్లలో కారం కొట్టిన గంజాయి బ్యాచ్.. అతని ఫోన్, నగదును అపహరించారు. ఇలా మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు.

గంజాయి సరఫరాకు కట్టడి లేకపోవడంతోనే ఈ దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటన మరొకటి హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో జరిగింది. గంజాయి మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. ఆడుకుంటున్న 9ఏళ్ల బాలుడి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన బాలుణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

నగరంలో యువతపై గంజాయి ప్రభావం తీవ్రంగా పడుతోంది. చదువుతున్న యువత కూడా డ్రగ్స్ మత్తుకు, మద్యానికి బానిసలవుతున్నారు. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా.. ఎక్కడా కట్టిడి చేయలేకపోతున్నారు. దీంతో భాగ్యనగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Related News

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

Big Stories

Advertisement
×