Big Stories

Cirminal Case On Councillor: కౌన్సిలర్ అక్రమ నిర్మాణాలు.. ప్రశ్నించిన అధికాారిపై ఇనుప రాడుతో దాడి..

Criminal Case On Jammikunta Councillor: జమ్మికుంట మున్సిపాలిటీలోని 3వ వార్టు పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా ప్రజలకు రక్షణ ఉండాల్సిన కౌన్సిలర్లే దాడికి దిగారు. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. జమ్మికుంట పరిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు వేస్తున్నారని అదే వార్డుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు.

- Advertisement -

ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు ఆదేశించారు. బోరు వేయడం నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఫిర్యాదు చేసిన వారిపై ఇనుపరాడుతో దాడిగి దిగాడు.

- Advertisement -

Read More: ఓఆర్ఆర్ హైదరాబాద్ కు లైఫ్ లైన్.. ఆర్థిక ప్రగతే లక్ష్యం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20న జమ్మికుంట మున్సిపాలిటీలోని 3వ వార్డు ఐన రామన్నపల్లిలో ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ పక్కన గల సన్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా బోర్ వేస్తున్నాడు. అదే వార్డుకు చెందిన మర్రి మల్లయ్య, కొలకని రాజు, మేడిపల్లి రమేష్ అక్కడికి వెళ్లి రవీందర్‌ని బోర్ అక్రమంగా ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు.

దీంతో ఆగ్రహంతో వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. మల్లయ్యకు తలపై, చేతులపై తీవ్ర గాయాలు కాగా.. రాజుకి తలపై , రమేష్‌కు చేతులపై తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

గత 2 నెలల క్రితం ఇట్టి కబ్జా విషయంపై మర్రి మల్లయ్య స్థానిక తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశాడు. ఆ విషయాన్ని మనుసులో ఉంచుకొని కావాలని చంపాలనే ఉద్దేశ్యంతో తన భర్తపై దాడి చేశాడని మల్లయ్య భార్య మర్రి రజిత పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.

ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సీ ఆర్ నంబర్ 56/2024 యూ/ఎస్ 307,506 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారని, రిమాండుకు తరలించడం జరుగుతుందని పట్టణ సీఐ రవి వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News