BigTV English

Indo Pak Border Tensions: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. ప్రజలను హెచ్చరించిన సజ్జనార్

Indo Pak Border Tensions:  భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. ప్రజలను హెచ్చరించిన సజ్జనార్

Indo Pak Border Tensions: ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య టెన్షన్ కంటిన్యూ అవుతోందా? కొద్దిరోజులపాటు ఇదే విధంగా ఉంటుందా? ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గినా, దాయాది దేశం దూకుడు కొనసాగిస్తుందా? అవుననే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అయితే ఈ ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు సైబర్ నేరగాళ్లు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఐపీఎస్ అధికారి సజ్జనార్.


తస్మాత్ జాగ్రత్త

ఐపీఎస్ అధికారి సజ్జనార్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. క్రిమినల్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎలాంటి ట్రెండ్‌ని ఫాలో అవుతారు? ఆయనకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదని కొందరు అధికారులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. తాజాగా ఇండియా-పాకిస్తాన్ మధ్య చిన్నపాటి వార్ జరుగుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో మరింత టెన్షన్ నెలకొంది.


ఈ ట్రెండ్‌ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని సైబర్ క్రిమినల్స్ కొత్త దందాకు తెరలేపినట్టు తెలిపారు ఐపీఎస్ అధికారి సజ్జనార్. తాము ఆర్మీ అధికారుల మంటూ తమ ఫోన్లకు సందేశాలు పంపుతూ, అందినకాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. డొనేషన్ సందేశాలను నమ్మి అలాంటివారికి డబ్బు చెల్లించకండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

వారితో జాగ్రత్త సుమా?

ఐపీఎస్ అధికారి సజ్జనార్ చెప్పారంటే కచ్చితంగా నిజం ఉంటుందని అంటున్నారు. క్రిమినల్స్ ఆలోచన తీరు ఏ విధంగా ఆయన ముందుగానే పసిగడతారని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజలను అలర్ట్ చేసి ఉంటారని అంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి నిత్యం సిద్ధంగా ఉంటారని అంటున్నారు.

ALSO READ: మావోయిస్టులు సంచలన నిర్ణయం, ఆరునెలలు కాల్పుల విరమణ

ఎందుకంటే ఇండో-పాక్ మధ్య చిన్నపాటి వార్ నేపథ్యంలో నిధుల కోసం ఆర్మీ అధికారుల పేరిట ఫోన్లకు మేసేజ్‌లు పంపుతారన్నది ఆయన మాట. అయినా ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు ఎవరైనా మెసేజ్‌లు పెడతారా? కనీసం ఆలోచించడానికి వారికి సమయం ఉండదు. కాకపోతే ప్రజల పిచ్చిని క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తారని అంటున్నారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశప్రజలు సైనికులకు నీరాజనాలు పలుకుతున్నారు.  పహల్‌గామ్ ఉగ్రదాడికి దాయాది దేశానికి తగిన బుద్ది చెప్పారని అంటున్నారు. ఈ పాయింట్‌ని తమకు అనుకూలంగా మలచుకుని చేసే అవకాశముందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు తన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ముందుగానే ప్రజలను అలర్ట్ చేశారు సజ్జనార్.

ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్ గురించి సజ్జనార్ స్పందించిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రియాక్ట్ అయ్యాయి. వాటిపై ఉక్కుపాదం మోపేందుకు దృష్టి సారించాయి. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల బంధాల‌ు-బంధుత్వాల‌ను ఏ విధంగా ఛిద్రం చేస్తున్నాయో కళ్ల ముందు జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఆన్‌లైన్ ఆట‌ల‌కు బానిస‌లుగా మారిన ఎంతోమంది టీనేజ‌ర్లు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

 

 

Related News

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

BC Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?

Birth Certificate: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Big Stories

×