Shree Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా సామజవరగమన సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా భారీ బిజీ అని అందుకోవడంతో ఈ హీరో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. ప్రస్తుతం సింగిల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ తో ఉన్న విభేదాల గురించి బయట పెట్టాడు. అయితే వీరిద్దరి మధ్య నిజంగానే గొడవలు జరిగాయా? నాకైతే ఏదో కారణం ఉందని అనిపిస్తోంది హీరో శ్రీ విష్ణు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం..
రోహిత్ తో విభేదాల పై క్లారిటీ ఇచ్చిన శ్రీవిష్ణు..
హీరో శ్రీవిష్ణు సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ముందుగా సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. హీరో నారా రోహిత్ తో విబేధాలు ఉన్నాయా అని యాంకర్ అడగ్గా.. విష్ణు మాట్లాడుతూ.. రోహిత్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు.. కొన్ని విషయాల్లో తప్పు అనిపించింది. అంతేకాని ఎటువంటి గొడవలు లేవని అంటున్నాడు.. ప్రస్తుతం విష్ణు ఇచ్చిన క్లారిటీ తో రూమర్స్ కు చెక్ పడింది.
బండ్ల గణేష్ తో బిజినెస్..
హీరో శ్రీవిష్ణు కు ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ గురించి అడగ్గా.. ఆయన లాంటి పెద్దవాళ్ళతో నేను బిజినెస్ చెయ్యడం ఏంటి..? అదేం లేదండి.. నేను బిజినెస్ చేస్తున్నా.. ఆర్గానిక్ మాత్రమే అంటూ తన బిజినెస్ గురించి బయటపెట్టాడు. మొత్తానికి అందరు హీరోల్లాగే ఈ హీరో కూడా దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకునే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం పలు బిజినెస్ లను కూడా చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది..
Also Read :మహేష్ బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. థియేటర్ల బద్దలవ్వడం ఖాయం..
సింగిల్ మూవీ..
కామెడీ జోనర్లో ‘సింగిల్’ అనే మూవీ చేశాడు శ్రీవిష్ణు. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకులు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో అని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో? కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తుందో చూడాలి..