RTC conductor news in telangana(Local news telangana): సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయినా సరే సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. కొందరు వేలు.. మరికొందరు లక్షలు.. ఇంకొందరు కోట్లలో డబ్బు పొగొట్టుకున్నారు. దయచేసి అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చిన మేసెజ్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి అంటూ పదేపదే చెబుతున్నారు పోలీసులు.
ఇలాంటి ఉచ్చులో తెలంగాణకి చెందిన ఆర్టీసీ కండక్టర్ చిక్కుకున్నాడు. ఏకంగా 11 లక్షలు పోగొట్టుకుని నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఆయనను ఓదార్చడం కుటుంబసభ్యుల వంతైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామకు చెందిన ఆర్టీసీ కండక్టర్ సైబర్ వలలో చిక్కుకున్నాడు.
జనగామకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రామేశ్వర్. అప్పులు చేసి సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంటి పనుల నిమిత్తం 11 లక్షలు బ్యాంక్ ఖాతాలో ఉంచాడు. అయితే ఆయన డ్యూటీలో ఉండగా యూనియన్ బ్యాంక్ నుంచి ఓ మేసెజ్ వచ్చింది. అందులో లింక్ కూడా ఉంది. దాన్ని క్లిక్ చేశారాయన. అకౌంట్లో ఉన్న 11 లక్షలను సైబర్ మోసగాళ్లు కాజేశారు. బ్యాంక్ నుంచి ఎందుకు మేసేజ్ వచ్చిందో ఆయనకు తెలియ లేదు. మరుసటి రోజు బ్యాంకును సంప్రదించాడు. అకౌంట్ చెక్ చేసుకోగా 11 లక్షలు మాయమయ్యాయి.
ALSO READ: భాగ్యనగరంలో ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్.. అన్ని కష్టాలకూ ఇక చెక్
ఒక్క తెలంగాణ నుంచి సైబర్ మోసగాళ్లు రోజుకు ఐదు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. సాంకేతిక టెక్నాలజీ వినియోగం అధికంగా ఉన్న తెలంగాణలో ఆ తరహా లూటీ జరగడం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నమాట. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.
ఏపీలో అయితే సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు సరికొత్త ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుళ్లలో బీటెక్ కంప్యూటర్స్ చేసినవారిని 200 మందిని కమాండోలుగా ఎంపిక చేశారు. వారికి అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రజలు ఎక్కువగా మోసపోయే 16 సైబర్ మోసాలను పోలీసులు గుర్తించారు. వీళ్లంతా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. త్వరలో దీనికి సంబంధించి యాప్‌ను విడుదల చేయనున్నారు.