Damodar Raja Narsimha : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చోటు దక్కించుకున్నారు. ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2006లో తొలిసారిగా మంత్రిగా అవకాశం దక్కింది. 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మూడోసారి మంత్రయ్యారు.
దామోదర రాజనర్సింహ ప్రొఫైల్..
1989లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం
2004లోనూ శాసనసభ సభ్యుడిగా ఎన్నిక
2006లో మంత్రిగా అవకాశం
2009లోనూ ఎమ్మెల్యేగా విజయం
రోశయ్య మంత్రివర్గంలో చోటు
2010లో కిరణ్‌కుమార్ హయాంలో మంత్రి
2011లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు