BigTV English

MLC Kavitha’s Custody Extends: కవితకు కలిసిరాని కొత్త సంవత్సరం.. పొలిటికల్ కేసంటూ వ్యాఖ్యలు!

MLC Kavitha’s Custody Extends: కవితకు కలిసిరాని కొత్త సంవత్సరం.. పొలిటికల్ కేసంటూ వ్యాఖ్యలు!
Delhi liquor scam case MLC Kavitha judicial custody extends
MLC Kavitha judicial custody extends

MLC Kavitha’s Custody Extends on Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొత్త సంవత్సరం కలిసిరానట్లుంది. కనీసం ఉగాది రోజైనా ఉపశమనం కలుగుతుందని ఫ్యామిలీ సభ్యులు, పార్టీ నేతలు భావించారు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. తాజాగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు షాకిచ్చింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఆమె రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 23వరకు ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు.


కవిత రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ న్యాయవాదులు చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందిం చింది న్యాయస్థానం. దీన్ని అపోజ్ చేశారు కవిత తరపు న్యాయవాదులు. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుకు ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న ఈడీ న్యాయవాదులు, 2022 నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సాక్షులను ప్రభావితం చేసే తొలి వ్యక్తి ఆమెనని తెలిపారు. చివరకు ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు కవితతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోరారు. న్యాయస్థానంలో భర్త, బంధువులను కలిసేందుకు కవిత అప్లికేషన్ ఇచ్చారు.

కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్‌ను ఇప్పటికే న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో మార్చి 15న అరెస్టయిన కవిత, అదేనెల 26 నుంచి తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఇదిలావుండగా కవిత న్యాయ వాదుల సూచన మేరకు కవిత రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌ను ఈనెల 16న విచారణ చేపడతామన్నారు.


Also Read: యూఎస్‌లో విద్యార్థుల హత్యలు, హైదరాబాద్ యువకుడి మృతిపై అనుమానాలు!

మరోవైపు కోర్టుకు వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడిన కవిత, ఈ కేసు పూర్తిగా పొలిటికల్ కేసు అని చెప్పారు. విపక్ష పార్టీలను టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలిపారు. సీబీఐ జైలులోనే తన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసిందన్నారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×