BigTV English

HYD Student Dead in US: యూఎస్‌లో విద్యార్థుల హత్యలు.. హైదరాబాద్ యువకుడి మృతిపై అనుమానాలు

HYD Student Dead in US: యూఎస్‌లో విద్యార్థుల హత్యలు.. హైదరాబాద్ యువకుడి మృతిపై అనుమానాలు
Indian student after missing for three weeks found dead in US
Indian student after missing for three weeks found dead in US

Hyderabad student dead in US: అమెరికాలో ఏం జరుగుతోంది? ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు మృత్యువాత పడుతున్నారు? స్టూడెంట్స్‌ను అక్కడ గ్యాంగులు ఎందుకు టార్గెట్ చేశాయి? కేవలం డబ్బు కోసమేనా? అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇవే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడు తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కి చెందిన మరో విద్యార్థిని చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.


అమెరికాలో చదువు కోవాలనేది, ఉద్యోగం చేయాలన్నది సగటు భారతీయుల విద్యార్ధుల డ్రీమ్. ఇందు కోసం నిద్రలేని రాత్రుళ్లు గడుపుతారు. కష్టపడి అక్కడి యూనివర్సిటీల్లో అవకాశం సొంతం చేసుకుంటారు. పేరెంట్స్ కూడా లక్షల్లో ఖర్చు చేసిన తమ పిల్లలను అక్కడికి పంపిస్తారు. ఏదో తమ కొడుకు ప్రయోజకుడు అవుతాడని గంపెడంత ఆశతో ఉంటారు. చివరకు అక్కడి గ్యాంగులకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన అర్ఫాత్ అనే స్టూడెంట్ అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్లాడు. ఓహియోలోని క్లీవ్‌లాండ్ యూవర్సిటీలో చదువుతున్నాడు.

అయితే మూడువారాల నుంచి అర్ఫాత్ కనిపించలేదు. దీంతో కంగారుపడిన పేరెంట్స్.. తోటి విద్యార్థులకు ఫోన్ చేసిన కనుగొన్నారు. చివరకు క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ఫాత్‌పై అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి కిడ్నాప్ గ్యాంగ్ నుంచి అర్ఫాత్ పేరెంట్స్‌కి బెదిరింపు ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మీ కొడుకుని కిడ్నాప్ చేశామని 1200 డాలర్లు చెల్లిస్తే విడిచిపెడతామన్నది అందులో సారాంశం. ఈ విషయాన్ని అర్ఫాత్ తండ్రి న్యూయార్క్ లోని భారతీయ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు మీడియాకు చెప్పారు.


Also Read: Israel: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. వీడియో రిలీజ్

చివరకు సోమవారం క్లీవ్‌లాండ్‌లోని ఓ ప్రాంతంలో అర్ఫాత్ మృతదేహాన్ని గుర్తించినట్టు భారత రాయబార కార్యాలయం స్వయంగా వెల్లడించింది. అర్ఫాత్ ఫ్యామిలీ సభ్యులకు సంతాపం తెలిపింది. మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వారితో టత్‌‌లో ఉన్నట్లు ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. దీంతో అర్ఫాత్ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. అర్ఫాత్ మరణంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ యువకులు అక్కడ అనుమానాస్పదంగా మరణించడం, హత్యకు గురికావడం ఇటీవలకాలంలో పెరిగింది.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×