SRH Vs PBKS Match Preview and Prediction: ఐపీఎల్ మ్యాచ్ లు ఉత్సాహంగా, ఉత్తేజంగా యమా జోరుగా సాగుతున్నాయి. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొహలీలో రాత్రి 7.30కు జరగనుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2024 ఐపీఎల్ సీజన్ లో రెండు జట్లు సమఉజ్జీగా ఉన్నాయి. ఎందుకంటే రెండు జట్లు కూడా నాలుగేసి మ్యాచ్ లు ఆడి, రెండేసీ ఓడిపోయి, రెండేసి గెలిచాయి. దీంతో చెరో నాలుగు పాయింట్లతో టేబుల్ పట్టికలో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఒకదానికింద ఒకటి ఉన్నాయి.
ఐపీఎల్ మొత్తమ్మీద రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో గెలిచింది.. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇప్పటివరకు వీటి మధ్య అత్యధిక స్కోరు. 211 ఉంది. హైదరాబాద్ అత్యధిక స్కోరు 212గా ఉంది.
రెండు జట్ల బలాబలాల విషయానికి వస్తే, పంజాబ్ బ్యాటర్స్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ 4 మ్యాచ్ లు ఆడి 138 పరుగులు చేశాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 105 పరుగులు, శశాంక్ సింగ్ 91 పరుగులు సాధించారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. రబాడా 4 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకోగా, హర్ ప్రీత్ 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కోల్‌కతాకు తొలి ఓటమి..
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ లో క్లాసెన్ 4 మ్యాచ్ లలో 177 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 161, మార్క్ క్రం 127 పరుగులు చేశారు. బౌలర్ల విషయానికొస్తే.. పాట్ కమిన్స్ 4 మ్యాచ్ లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ 2 మ్యాచ్ లలో 4 వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఇటు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఇద్దరూ జట్టును గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలతో వస్తారో రాత్రి మ్యాచ్ లో చూడాల్సిందే.