BigTV English

Deputy Cm Batti : భవిత భాగ్యనగరిదే! – డిప్యూటీ సీఎం భట్టీ

Deputy Cm Batti : భవిత భాగ్యనగరిదే! – డిప్యూటీ సీఎం భట్టీ

Deputy Cm Batti : 


⦿ ఫోర్త్ సిటీతో మారనున్న నగర రూపురేఖలు
⦿ ఊపందుకోనున్న నిర్మాణ రంగం
⦿ బిల్డర్లూ భయాలు వీడండి
⦿ మూసీ నిర్వాసితులకు మంచి రోజులు
⦿ హైడ్రాపై విపక్షాలది అసత్య ప్రచారమే
⦿ బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు అందిస్తాం
⦿ నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, స్వేచ్ఛ : హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూసి ఓర్వలేకనే కొందరు విషప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం హైటెక్స్‌లో జరిగిన నరెడ్కో నిర్వహించిన ప్రాపర్టీ షోను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించిన నగర స్థిరాస్తి రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, నిర్మాణ రంగంపై ఉన్న అపోహలు వీడాలని బిల్డర్లకు సూచించారు.


భవిష్యత్ నగరం ఇదే..
హైదరాబాద్ నగరాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం వివరించారు. నగరాభివృద్ధికి బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. నగరవాసులకు మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని వివరించారు. సుమారు 30 వేల ఎకరాలలో అద్భుతమన ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు. ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్, హెల్త్, స్కిల్ హబ్‌ల రాకతో భాగ్యనగరపు రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా ఏర్పా్ట్లు, అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, AI ఆధారిత సంస్థలు ప్రపంచ పటంలో నగరానికి కొత్త గుర్తింపును తేబోతున్నాయన్నారు.

ALSO READ : పోలీసుల నిర్లక్ష్యం వల్లే! – మధుయాష్కీ గౌడ్

మూసీ ప్రక్షాళన తథ్యం..
మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూసీ నిర్వాసితులకు వారు ఉండే చోటే అద్భుతమైన టవర్స్ నిర్మించి, వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని భట్టి తెలిపారు. మూసీ నిర్వాసిత మహిళలతోపాటు నగరంలోని డ్వాక్రా మహిళలకు రూ. 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మూసీ అంశంపై విపక్షాలు రాజకీయంగా లబ్ది పొందేందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

నిర్మాణ రంగానికి మహర్దశ..
ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన నగర నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ వంటి పలు ప్రాజెక్టుల రాకతో నగరం మరింతగా విస్తరించనుందని, దీనిమూలంగా నిర్మాణ రంగం ఎన్నడూ లేనంతగా ఊపందుకోబోతోందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షలాది నివాస గృహాలు, కార్యాలయాల నిర్మాణంలో నగరంలోని నిర్మాణ సంస్థలన్నీ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నిర్మాణ రంగ సమస్యలు విని, పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కబ్జాకోరులు, అక్రమార్కులను నియంత్రించేందుకే హైడ్రాను తెచ్చామని, నిబంధనలు గౌరవించే వారికి ఎలాంటి ఇబ్బందీ రానీయమని హామీ ఇచ్చారు. బ్యాంకర్లతో చర్చించి స్థిరాస్తి వ్యాపారులకు రుణాలు అందేలా చొరవ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో స్తబ్దతకు లోనైన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఊపందుకుంటున్నాయన్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×