E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు నగలు ఎలాగైనా కొట్టేయాలనే కసితో ఉన్న మనోహరి ఆ బాధ్యతలను చంభాకు అప్పగిస్తుంది. అయితే చంభా బీరువా తాళాలు ఉంటేనే తాను ఆ పని చేయగలనని చెబితే.. అయితే నేను తాళాలు తీసుకొచ్చి ఇస్తాను. ఎవ్వరూ లేని టైంలో నగలు కొట్టేయమని మనోహరి సలహా ఇస్తుంది. చంభా సరే అంటుంది.

ఇక బీరువా తాళాలు తీసుకురావడానికి మిస్సమ్మ రూంలోకి వెళ్తుంది మనోహరి. రూం మొత్తం వెతుకుతుంది. ఎవరైనా వస్తే చెప్పమని డోర్‌ దగ్గర చంభాను కాపలా ఉంచుతుంది. చంభా ఇల్లు క్లీన్‌ చేస్తున్నట్టు డోర్‌ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడే మిస్సమ్మ వెళ్తుంది. చంభాను నోరు తెరవొద్దని వార్నింగ్‌ ఇచ్చి రూంలోకి వెళ్తుంది మిస్సమ్మ. వెళ్లగానే.. రూంలో వెతుకుతున్న మనోహరిని చూసి ఏం వెతుకుతున్నావు మనోహరి అని అడుగుతుంది.

Advertisement

మిస్సమ్మ వాయిస్‌ వినగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. భయంతో వణికిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని మనసులో ఆలోచిస్తుంది. మిస్సమ్మ మాత్రం నిన్నే అడిగేది నా రూంలోకి వచ్చి ఏం వెతుకుతున్నావు మనోహరి అనగానే.. మనోహరి తడబడుతూ.. అది సేప్టీ పిన్ను కోసం వచ్చాను కనిపించడం లేదు అంటుంది.. నాకు నువ్వు వేరే ఏదో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అంటూ తన బెడ్‌ కింద ఉన్న నగలు తీసి బెడ్‌ మీద పెడుతుంది మిస్సమ్మ.

మిస్సమ్మ నగలు పైన పెట్టడం చూసి మనోహరి షాక్‌ అవుతుంది. ఏంటి అంత ఖరీదైన నగలు ఇంత నిర్లక్ష్యంగా బెడ్‌ కింద పెట్టావేంటి..? అని అడిగితే.. ఎందుకు దొంగలేమైనా వస్తారా..? మనోహరి.. ఒకవేళ వచ్చినా బీరువాలో చూసి వెళ్లిపోతారు.. కదా అంటూ నగలు తీసి బీరువాలో పెడుతూ.. మనోహరికి సేప్టీ పిన్ను ఇస్తుంది. పిన్ను తీసుకున్న మనోహరి కంగారుగా బయటకు వస్తుంది. మనోహరి బయటకు రాగానే..

Advertisement

చంభా భయంతో ఆ మిస్సమ్మకు దొరికిపోయావా మనోహరి అని అడుగుతుంది. లేదు కానీ అది నగలు బయట బెడ్‌ కింద దాచింది అంటూ చెప్పగానే.. అయ్యో మంచి చాన్స్‌ మిస్‌ అయ్యాము కదా మనోహరి అని చంభా అంటే ఇంకా ఏం కాలేదు కదా..? మేమంతా బయటకు వెళ్లాకి ఆ నగలు నువ్వు కొట్టేయ్‌ అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. చంభా మాత్రం అందుకేనా నేను ఎదురుచూసేది నగలు కొట్టేసి కొల్‌కతా చెక్కేస్తాను అని మనసలో అనుకుంటుంది చంభా.

తర్వాత మనోహరి ఏర్పాటు చేసిన రౌడీలు పార్థును చంపేందుకు ఫారెస్టులో రెడీగా ఉంటారు. పార్థు రాగానే ఎలా చంపాలి..? చంపిన తర్వాత ఏం చేయాలి అనే విషయాలు రౌడీలకు చెప్తుంటాడు వాళ్ల బాస్‌. అప్పుడే మనోహరి రౌడీలకు ఫోన్‌ చేసి తాను పార్థుతో కలిసి కారులో వస్తున్నట్టు ఇన్‌డైరెక్టుగా చెప్తుంది. రౌడీలు మనోహరి మాటలు అర్థం చేసుకుని మరింత అలెర్ట్ గా ఉంటారు.

ఇక అమర్‌, మిస్సమ్మ కూడా లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తుంటారు. కారులో ఎఫ్‌ఎం ఆన్‌ చేయబోతుంది మిస్సమ్మ. అమర్‌ వద్దని నీ ఎఫ్‌ఎం ఉండగా మరోటి ఎందుకు అంటాడు. తాను వర్క్‌ చేయడం మానేసి చాలా రోజులైంది మళ్లీ ఇప్పుడు నా ఫ్రోగ్రాం ఎలా వస్తుందని మిస్సమ్మ అడిగితే.. అదే నీ నోరు ఉంది కదా కబుర్లు చెప్పమంటాడు అమర్‌. మిస్సమ్మ కోపంగా అమర్‌ను తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×