BigTV English

KCR: ఫామ్‌హౌస్‌లో రెండుగంటలపాటు చర్చ.. కేటీఆర్‌కు ఆదేశాలు, కవిత విషయం నేను చూస్తా..?

KCR: ఫామ్‌హౌస్‌లో రెండుగంటలపాటు చర్చ.. కేటీఆర్‌కు ఆదేశాలు, కవిత విషయం నేను చూస్తా..?

KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ విషయం ఎంతవరకు వచ్చింది? ఇంతకీ ఆ లెటర్ బయటపెట్టిందెవరు? ఆదివారం కేసీఆర్-కేటీఆర్ మధ్య ఆదివారం జరిగిన గంటన్నర భేటీలో ఏం జరిగింది? ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని సలహా ఇచ్చారా? తాను చూసుకుంటానని పెద్దాయన ఎందుకన్నారు? కూతురుతో రాయబారం మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కవిత లెటర్‌పై గంటన్నరపాటు చర్చ

ఎమ్మెల్సీ కవిత లెటర్ ఎపిసోడ్ వ్యవహారం అధినేత కేసీఆర్ వద్దకు చేరింది. కవిత రాసిన లెటరు, ఎయిర్​‌పోర్టులో కామెంట్స్ వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కవిత వ్యవహారంపై ప్రధానంగా కేసీఆర్-కేటీఆర్ మధ్య చర్చ సాగింది. లెటర్ తర్వాత జరిగిన.. జరగనున్న పరిణామాలను నిశితంగా పరిశీలించారు.


కావాలనే ఎవరో కుట్ర చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆ విషయంపై నోరెత్తడం అంతగా మంచిది కాదని పెద్దాయన అన్నట్లు పార్టీ వర్గాల మాట. ఒకవేళ సైలెంట్‌గా సోషల్‌మీడియాలో అనుకూల వ్యతిరేక వర్గాలు రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుందని ప్రస్తావించారట. కొన్ని విషయాల్లో కామ్‌గా ఉండేటమే బెటరని అన్నారట.

సీనియర్ రాజకీయ నేతలు ఇదే పద్దతి అవలంబిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు మనం సేకరించిన విషయాలను బయటపెడదామని అన్నారట కేసీఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయం మాట్లాడితే పార్టీలో విభేదాలు వచ్చాయంటూ రకరకాలు ఊహాగానాలకు తావిచ్చినవాళ్లుం అవుతామని మాట్లాడుకున్నారట.

ALSO READ: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు

అందుకే కవిత విషయంలో పైనుంచి కింది స్థాయి వరకు ఏ ఒక్కరూ నోరు ఎత్తవద్దని ఓపెన్‌గా చెప్పారట. దీనిపై కాంగ్రెస్- బీజేపీలకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుందని అన్నారట. ఈ ఎపిసోడ్​‌ను తాను డీల్ చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాల మాట. మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరైనా ఈ అంశంపై ప్రశ్నిస్తే అధిష్ఠానం చూసుకుంటుందంటూ చెప్పాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది.

అంతర్గత వ్యవహారాలపై కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చెప్పారట పెద్దాయన. కవిత వ్యవహారం తాను చూసుకుంటానని అన్నారట. ఈ లెక్కన రేపో మాపో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కవితకు కబురు రానుందని అంటున్నారు. కేటీఆర్ ​ఆమెరికా పర్యటన, కాళేశ్వరం కమిషన్​ నోటీసుల వ్యవహారాలపై చర్చించినట్టు సమాచారం.

కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్-కేటీఆర్‌లు చర్చించినట్టు తెలుస్తోంది. జ్యుడీషియల్ కమిషన్ నోటీసులపై ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్-హరీష్‌రావులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడిన విషయాలపై చర్చించారు. కమిషన్ దాదాపుగా అందర్నీ విచారించిందని, తమ వరకు మాత్రమే పెండింగ్‌లో ఉంది.

ఇప్పుడు కుదరదు అని చెబితే వారు వచ్చే అవకాశముందని అనుకున్నారట. లేకుంటే వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశముందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణ కోసం కొంత సమయం కోరితే బెటరని భావిస్తున్నారట తండ్రీ కొడుకులు. మరి హరీష్‌రావు వెళ్లాల్సి వుంటుందని, న్యాయనిపుణులు చెప్పిన తర్వాత ఆ విధంగా హరీష్ ఫాలో అయితే బెటరని అన్నారట. ఈనెల చివరికి కమిషన్ ముందు హాజరవుతారా? లేదా అనేది తేలనుంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×