Manchu Manoj: మంచు మనోజ్(Manchu Manoj).. తాజాగా నారా రోహిత్(Nara Rohit) , బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) తో కలిసి నటిస్తున్న చిత్రం భైరవం (Bhairavam). మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈమెతో పాటూ దివ్యా పిళ్ళై (Divya pillai), ఆనంది(Anandi )హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్, మాస్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆ బాధ నేను కూడా అనుభవించాను సారీ వదిలేయండి అంటూ విజయ్ కనకమేడల బాధను పంచుకున్నారు మంచు మనోజ్. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
ఆ బాధ నేను అనుభవించాను.. వదిలేయండి- మంచు మనోజ్
అసలు విషయంలోకి వెళితే.. మే 18న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ కనకమేడల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లు ఆయనపై నెగెటివిటీని పెరిగేలా చేశాయి వైసీపీ శ్రేణులు విజయ్ కనకమేడలపై నెగటివ్ ట్రోల్స్ చేశారు. దీనికి తోడు 2011లో విజయ్ అకౌంట్లో దర్శనమిచ్చిన ఫోటో మెగా అభిమానుల ఆగ్రహానికి కూడా కారణమైంది. దీంతో అటు వైసీపీ శ్రేణులతో పాటు అటు మెగా అభిమానులు కూడా విజయ్ కనకమేడలపై పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేశారు.పైగా “#బాయ్ కాట్ భైరవం” అంటూ ట్రెండింగ్ లోకి తెచ్చారు. ఇక దీనిపై భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ ఎమోషనల్ గా మాట్లాడారు.. మనోజ్ మాట్లాడుతూ.. ఇటీవల ఈ సినిమా విషయంలో బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. దర్శకుడు విజయ్ పని పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. 10 మందికి సేవ చేస్తూ ఉంటారు. విజయ్ ఏదో ఒక పోస్ట్ పెట్టారని కొంతమంది అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. ఆయన చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని. అందరూ ఒకటయ్యి .. మనల్ని ఒంటరి చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. వేరే ఎవరైనా అంటే ఆయన పట్టించుకునే వారు కాదు. కానీ కుటుంబం లాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాని మెగా అభిమానులు కచ్చితంగా సపోర్ట్ చేయాలి.విజయ్ ఖాతాలోని గత పోస్ట్ నిజమో కాదో తెలియదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మా టీం తరఫున మెగా అభిమానులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను” అంటూ మనోజ్ తెలిపారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎంతోమంది కష్టంతో నేను నటించిన సినిమా భైరవం ఆశీర్వదించండి. ఇప్పటికీ నా వెంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించిన విజయ్ పోస్ట్..
అసలు విషయంలోకి వెళ్తే ..2011లో చిరంజీవి, రామ్ చరణ్ లపై విజయ్ కనకమెడల ఒక పోస్ట్ పెట్టారు. హిందీలో అభిషేక్, అమితాబ్ కలసి నటించిన ‘పా’ మూవీ పోస్టర్ను మార్ఫింగ్ చేసి రామ్ చరణ్ చిరంజీవిని ఎత్తుకున్నట్టు వారి ముఖాలను అతికించి పోస్ట్ చేశారు. ఆ పోస్టర్ కి ‘ఛా’ అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు సామాజిక న్యాయం సమర్పించు ఛా అని పెట్టాడు. ఇక దీంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ #బాయ్ కాట్ భైరవం అంటూ ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.
ALSOR EAD:Kannappa: ‘కన్నప్ప’ రన్ టైమ్ లాక్.. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంతంటే?