BigTV English

Skin Care Routine: ఈ చిన్న చిట్కాను రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

Skin Care Routine: ఈ చిన్న చిట్కాను రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

Skin Care Routine: ప్రకాశవంతమైన మెరిసే చర్మం కావాలని.. ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక చర్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖంపై విపరీతంగా మొటిమలు రావడం.. ఆ తర్వాత మచ్చలుగా ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు ప్రధానంగా శరీరంలో వేడి, సరైన పోషకాహారం తినకపోవడం, పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్ వంటి పలు రకాల కారణంగా వల్ల.. చర్మ సమస్యలు ఎక్కుగా వచ్చే అవకాశం ఉంది.


వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే క్రీములు వాడటం, పార్లర్‌కి వెళ్లడం, రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే.. వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేకుండానే.. మీ అందాన్ని అనూహ్యంగా పెంచుకోవచ్చు. కేవలం వంటింటి పదార్దాలతోనే మంచి స్వేద వర్ణాన్ని, మెరుపును ఇట్టేపెంచుకోవచ్చు. ఇంకెందుకు లేట్.. ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు..
బియ్యంపిండి టీస్పూన్
మైదా అరటీస్పూన్
పెరుగు రెండు టేబుల్ స్పూన్స్
పసుపు చిటికెడు
రెండు టీస్పూన్ల నిమ్మరసం


ఫేస్ ప్యాక్ కోసం తయారు చేసుకునే విధానం
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో బియ్యంపిండి, మైదా, పెరుగు, పసుపు, నిమ్మరసం పైన చెప్పిన విధంగా తీసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి, స్పూత్ పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసి.. అరగంట తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖంపై మృత కణాలు తొలగిపోయి ముఖంలో అనూహ్యమైన మెరుపు వస్తుంది. తాజాగా, యవ్వనంగా కనిపిస్తారు కూడా. అంతేకాదు ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖంపై ముడతలు, మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. ఫేస్ కాంతివంతంగా.. అందంగా, మిలమిల మెరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ సాయంత్రం లేదా నైట్ టైమ్‌లో ముఖానికి పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే.. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు.

ముఖం అందంగా కనిపించేందుకు ఈ చిట్కాలు కూడా పాటించండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి.

బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం నిత్యం తాజాగా మెరుస్తుంది.

కాఫీ పొడి, మిల్క్ ఫేస్ ప్యాక్
చిన్నబౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్ పాలు కలిపి.. ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మృత కణాలు తొలగిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.

Also Read: కొరియన్స్ లాంటి చర్మం కావాలంటే.. ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

శెనగిపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో.. శెనగపిండి రెండు టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, రెండు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని బాగా కలపండి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి అందంగా కనిపిస్తారు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×