Dr. KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే.ఎ. పాల్, తన టీమ్‌తో కలిసి టర్కీకి శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో పాల్ ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేఏ పాల్, ఆయన టీమ్ ఇప్పటికే విమానంలో టర్కీకి ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ఎయిర్‌లైన్ సిబ్బంది వారిని అక్రమంగా అడ్డుకున్నట్లు పాల్ ఆరోపిస్తున్నారు. తనను అడ్డగించిన ఇండిగో ఎయిర్ లైన్ సిబ్బందితో పాల్ కాసేపు వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. శాంతి కార్యక్రమాలకు ఎంతో ముఖ్యమైన ఈ శిఖర సభలో పాల్గొనేందుకు వెళుతుండగా, ఎలాంటి అవరోధం లేకున్నా తనను సిబ్బంది అడ్డుకున్నారన్నది పాల్ ఆరోపణ.
Also Read: Train Mishap: రైలు ఎక్కే చిన్నారి.. అక్కడే ప్రాణం వదిలి.. అసలేం జరిగిందంటే?
శాంతి చర్చల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లగలిగే సత్తా తనకు ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్ కోరుతున్నారు. చివరగా తనను అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాల్, ఆయన కోడలు జ్యోతిలు ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు.