President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా ముందుగానే.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రాగానే.. గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పుష్పగుచ్చాన్ని అందించి, పలువురు అధికారులు కూడా స్వాగతం పలికారు.
అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి కాన్వాయ్ బయలుదేరి వెళ్ళింది. రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో, పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగుతున్న సందర్భంగా, హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సందర్భంగా పోలీసులు హైదరాబాద్ లో భారీ బందోబస్తు చేపట్టారు.
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
బేగంపేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి, అడిషన్ డీజీ మహేష్ భగవత్… pic.twitter.com/uPnzkYWSi6
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024