తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) ప్రస్తుతం 8వ సీజన్ నడుస్తుండగా.. ఇటీవలే 11వ వారం కూడా పూర్తి చేసుకుంది. ఈ 11 వ వారం ఫ్యామిలీ వీక్ అంటూ సరదాగా సాగిపోయిన విషయం తెలిసిందే. అయితే 11వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న మిగిలిన పదిమంది కంటెస్టెంట్స్ ఈవారం మెగా చీఫ్ కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టీ షర్టు కి సంబంధించిన గేమ్ నిర్వహించగా.. అందులో టీ షర్ట్ చింపేస్తూ కంటెస్టెంట్స్ బాగానే పోటీపడ్డారు. చివరికి నిఖిల్, గౌతమ్ టేస్టీ తేజ టీషర్టును కాపాడి.. తేజకు మెగా చీఫ్ కంటెండర్ షిప్ కోసం పోటీపడే అవకాశాన్ని కల్పించారు.
ఇకపోతే తాజాగా మరో టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఈ నేపథ్యంలోనే ‘పట్టు వదలని విక్రమార్కులు’ అంటూ ఒక టాస్క్ పెట్టారు. అందులో కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగానే పోటీపడ్డారని చెప్పవచ్చు. మరి ఇక ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తాజాగా 12వ వారానికి సంబంధించి 81 వ రోజు ప్రోమో ని విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ టాస్క్ లో రోహిణి, టేస్టీతేజ, యష్మీ, పృథ్వీ, విష్ణు ప్రియ, నబీల్, ప్రేరణ, నిఖిల్ పోటీ పడగా గౌతమ్ సంచాలక్ గా వ్యవహరించారు.
ఇక ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. పోటీ దారులు మెగా చీఫ్ అవ్వడానికి.. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలని విక్రమార్కులు. ఈ టాస్క్ లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా. మీ పట్టు వదలకుండా రంగు ఫ్లాట్ ఫామ్ మీద తాడును పట్టుకొని నిలబడాలి అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఇందులో రోహిణి, టేస్టీ తేజ, పృథ్వి, యష్మీ, విష్ణు ప్రియ పోటీపడ్డారు. ఇక సంచాలక్ గా వ్యవహరించిన గౌతమ్ డయాస్ మార్చగానే బ్లూ కలర్ వచ్చింది. ఇక వెంటనే పృథ్వి కింద ఉన్న బాక్స్ ని లాగేశారు. దాంతో పృథ్వీ పక్కనే ఉన్న యష్మీ బాక్సు పైన నిలబడే ప్రయత్నం చేశారు. ఇక అలా ఆమె సహాయంతో ఆమె బాక్స్ పైన నిలబడడంతో రోహిణి మాట్లాడుతూ.. విష్ణు ప్రియ తో.. నీకు ఛాన్స్ మిస్ అయింది అంటూ కామెంట్ చేసింది. ఇక తర్వాత టేస్టీ తేజ.. అన్ని విష్ణుప్రియకే కలిసొస్తున్నాయంటూ కామెంట్ చేశాడు. ఇక తర్వాత యష్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఏకాగ్రత అంటూ కామెంట్ చేసింది రోహిణి.
ఇక తర్వాత రోహిణి ఛాన్స్ వచ్చింది. వెంటనే రోహిణి పక్కనే ఉన్న టేస్టీ తేజ బాక్స్ మీదకు వెళ్ళింది. ఇక తర్వాత టేస్టీ తేజను పట్టుకొని నిలబడింది రోహిణి. వెంటనే టేస్టీ తేజ.. కల్లో కూడా అనుకోలేదండి అంటూ కామెంట్ చేయగా.. ఏంటి నేను పట్టుకున్నాననా అంటూ కామెంట్ చేశారు రోహిణి. తర్వాత బిగ్ బాస్ నా కల నెరవేర్చారు అంటూ అరిచాడు టేస్టీ తేజ. ఇక తర్వాత యష్మి కింద ఉన్న బాక్స్ కూడా లాగేసారు. ఇక వీరు పడ్డ కష్టం మామూలుగా లేదు. మొత్తానికైతే ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.