BigTV English

Child Stuck in Lift : లిఫ్ట్ కు గోడకు మధ్యలో నాలుగేళ్ల చిన్నారి విలవిల – మీ లిఫ్ట్ ఓసారి చెక్ చేసుకోండి

Child Stuck in Lift : లిఫ్ట్ కు గోడకు మధ్యలో నాలుగేళ్ల చిన్నారి విలవిల – మీ లిఫ్ట్ ఓసారి చెక్ చేసుకోండి

Child Stuck in Lift : హైదరాబాదులోని నాంపల్లిలో నాలుగేళ్ల చిన్నారి లిఫ్ట్ కి, గ్రిల్స్ కి మధ్యలో ఇరుక్కున్న ఘటన కలకలం సృష్టించింది. లిఫ్ట్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు గ్రిల్స్ మధ్యలో చిక్కుకుపోయిన చిన్నారి.. లిఫ్ట్ కి గోడకి మధ్యలో ఊపిరాడని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. బాలుడు పెట్టిన కేకలతో విషయం తెలుసుకున్న అపార్ట్ మెంట్ వాసులు.. డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి బాలుడిని కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు. బాలుడు తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే.. ఎన్డీఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ ఘటన నగరంలో సురక్షితంగా లేని లిఫ్ట్ లు, వాటి మరమత్తుల విషయమైన అపార్టుమెంట్ వాసులకు హెచ్చరికగా నిలుస్తోంది.


తన నాయనమ్మ, తాతయ్యతో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన బాలుడు.. అంతా ఇంట్లోకి వెళ్లిన తర్వాత లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చాడు. కొద్ది సేపటికి ఒక్కడే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్థుకు వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ గ్రిల్స్ సరిగా పడకపోవడంతో రెండింటి మధ్యలో ఇరుక్కుపోయిన నాలుగేళ్ల బాలుడు.. బాధతో విలవిల్లాడిపోయాడు. అతని ఛాతీ భాగం గట్టిగా ఒత్తుకుపోయిన కారణంగా ఊపిరి తీసుకునేందుకు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది.. బాలుడికి నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ, అతను స్పృహలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

గ్రిల్ డోర్ సరిగా మూసుకోకపోవడంతోనే బాలుడు.. గ్రిల్స్, గోడకు మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా.. బాలుడు ప్రమాదానికి గురైన తర్వాత అతని కేకలు విని అంతా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని పైకి తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినా, వీలు కాకపోవడంతో.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని, కింద అంతస్తులోని గోడల్ని పగులగొట్టారు. పైనుంచి వైద్యులు ఆక్సిజన్ అందించారు. అలా.. అనేక ప్రయత్నాల తర్వాత.. బాలుడిని సురక్షితంగా కాపాడకలిగారు. అయితే బాలుడు ఇరుక్కున్న తర్వాత అదృష్టవశాత్తు లిఫ్ట్ పూర్తిగా ఆగిపోయింది. అలా కాకుండా.. లిఫ్ట్ కొద్దిగా కిందకి వెళితే ఆ రెండింటి మధ్యలో బాలుడు ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని అపార్ట్ మెంట్ వాసులు తెలుపుతున్నారు. మొత్తంగా అనేక ప్రయత్నాల తర్వాత బాలుని సురక్షితంగా కాపాడిన డీఆర్ఎఫ్ సిబ్బంది.. హుటాహుటిన బాలుడిని నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు.


Also Read : KCR – Assembly : కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా ఆర్డర్ ఇవ్వండి – హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్

ఈ ఘటన నగరంలోని లిఫ్ట్ ల భద్రతపై సరికొత్త సందేహాలను లేవనెత్తుతుంది. అనేక అపార్టుమెంట్లల్లో లిఫ్టులు ప్రమాదకరంగా ఉన్నాయనేది వాస్తవం. చాలా లిఫ్టులు చాలా పాతవి కాగా, వాటి నిర్వహణ సైతం సరిగా చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి అత్యాధునిక లిఫ్టులను, భద్రతా ప్రమాణాల్ని పాటించకుండా.. పాత తరం లిఫ్టులనే వినియోగిస్తుండడంతో.. ప్రమాదాల తీవ్రత, సంఖ్యా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలాగే.. సురక్షితం కాని లిఫ్టుల దగ్గరకు పిల్లల్ని ఒంటరిగా వెళ్లనివ్వద్దని, వాళ్లతో పాటుగా కచ్చితంగా పెద్దవాళ్లు తోడుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు లిఫ్ట్ లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాల్ని నేర్పించాలని సూచిస్తున్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×