Sandeep Kishan..టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ (Sandeep Kishan) . గత కొన్ని రోజులుగా సినిమాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ లేదా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే మాత్రం.. కీలకపాత్ర చేయడానికి కూడా వెనుకాడడం లేదు. గత ఏడాది ధనుష్ (Dhanush) హీరోగా నటించిన రాయన్ (Raayan ) సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఉండగా ఇప్పుడు మళ్లీ ట్రాక్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే.. తాజాగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన (Trinath Rao nakkina) డైరెక్షన్లో ‘మజాకా’ అనే సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రేమ గురించి చెప్పిన సందీప్ కిషన్, తాను బాధపడుతున్న ఆరోగ్య సమస్య గురించి అలాగే సర్జరీ చేయించుకోకపోవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
లవ్, బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్..
15 ఏళ్ల సినీ కెరియర్లో సందీప్ కిషన్ హీరోగా ఎన్నో పాత్రలలో నటించారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా.. తన నటనతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘ప్రస్థానం’ సినిమాతో తన సినీ కెరియర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన సందీప్ కిషన్.. చివరిగా ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ‘మజాకా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలో భాగంగా మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట కదా..నిజమేనా? అని ప్రశ్నించగా.. “నాకు ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్. ఆమెతో నాలుగు సంవత్సరాలు పాటు రిలేషన్ లో ఉన్నాను. కానీ ఆ బంధం బ్రేకప్ అయ్యింది. ఇక అంతే అప్పటినుంచి నేను ఏ అమ్మాయితో కూడా రిలేషన్ లో లేను. నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ గా అయితే లేరు” అంటూ క్లారిటీ ఇచ్చారు. సందీప్ కిషన్.
Also Read:Tollywood:టాలీవుడ్ కి బై బై అంటున్న హీరోయిన్స్..!https://www.bigtvlive.com/entertainment/senior-star-heroines-for-away-from-tollywood-industry.html
అందుకే సైనస్ సమస్యకు సర్జరీ చేయించుకోవడం లేదు..
అలాగే ఆయన తన ఆరోగ్య సమస్య గురించి కూడా మాట్లాడుతూ.. “నేను గత కొద్దిరోజులుగా ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను. సైనస్ అనే సమస్య నన్ను గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల సినిమా షూటింగ్ గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి మరీ నిద్రపోతున్నాను. అలా పడుకున్న తర్వాత ముక్కు నుంచి నా వెనుక భాగం వరకు అసలు గాలి ఆడకుండా జామ్ అయిపోతుంది. వీటికి తోడు ఉదయం లేచిన తర్వాత నేను ఎవరితో మాట్లాడలేను. వేడిగా టీ తాగి, మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్ విన్న తర్వాతే మాట్లాడతాను. అయితే దీని నుంచి బయటపడాలి అంటే సర్జరీ ఒక్కటే కారణం. కానీ అలా చేస్తే ముక్కు మారిపోతుంది. ముఖం మారిపోతుందనే భయం వేయడంతో సర్జరీ చేయించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేయించుకుంటే.. నెల రోజులపాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి.. అందులో 15 రోజులు ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇప్పుడున్న సమయంలో నెలపాటు షూటింగుకి బ్రేక్ అంటే అది కలలో కూడా ఊహించలేను ఫ్యూచర్లో చేయించుకుంటానేమో చెప్పలేను” అంటూ తెలిపారు సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.