Mukunda Jewellers New Show Room: ప్రముఖ నగల సంస్థ ముకుంద వారి అధ్వర్యంలో మరో కొత్త షో రూం ప్రారంభమైంది. కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలోని రోడ్ నెంబర్ 4లో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్, సిల్వర్ పేరుతో శనివారం షో రూంని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సంస్థ సీఈవో నిఖితా రెడ్డి, డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు రిబ్బని కటింగ్ చేసి షోరూంని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం సీఈఓ నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ముకుంద జ్యువెల్లరీపై చూపిన ప్రేమ, విశ్వాసానికి వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
పూర్వీ పేరిట వినియోగదారుల అభిరుచులకు తగ్గ డిజైన్‌లు, బడ్జెట్‌లో అందించే దిశగా పనిచేస్తున్నాము అని చెప్పారు.పూర్వీ జ్యువెలరీలో 18, 22, 24 క్యారెట్లలో ఆధునిక డిజైన్స్‌తో పాటు నూతన డైమండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 9 వరకు మూడు లక్షల రూపాయల విలువైన కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 1 నుంచి 3 వరకు మొదటి వెయ్యి మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కొత్త షోరూమ్‌ను సందర్శిస్తే 5 గ్రాముల వెండి కాయిన్ బహుమతిగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.