E-Paper
Advertisement

Drugs Seizure : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి..

Drugs Seizure : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి..
Advertisement
Hyderabad drugs news

Hyderabad drugs news(Breaking news in telangana):

తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం మరోసారి కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. ఎక్కడో ఒకచోట అది బయటపడుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే.. అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

తాజాగా.. నార్సింగిలో ఇద్దరు నిందితులను తాజాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ.. ఒక హీరో ప్రియురాలిగా అని సమాచారం. పక్కా సమాచారంతో పోలీసులు.. నార్సింగిలో లావణ్య, ఉనీత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్‌లో ఈ డ్రగ్స్ లభ్యమైంది.

Advertisement

టాలీవుడ్‌ హీరో ప్రియురాలైన లావణ్య.. సంగీతం టీచర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు ఉనీత్ రెడ్డి డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. కాగా ఆ డ్రగ్స్‌ని కొన్ని రోజుల క్రితమే ఆమె ఉనీత్ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ సమాచారంతోనే లావణ్యని.. SOT పోలీసులు తనిఖీ చేయగా హ్యాండ్‌బ్యాగ్‌లో ప్యాకెట్లు దొరికాయి. ఈ ఇద్దరిపై ఎన్డీపీఎస్ 22బీ, రెడ్ విత్ 8సీ కింద పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను రిమాండ్‌కి తరలించారు.

తాజాగా బయటపడిన ఈ విషయంలో ఇంకా ఎవరిప్రమేయం అయినా ఉందా.. దీని వెనుకున్న బలమైన శక్తులున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×