BigTV English
Advertisement

Tadpatri Assembly Constituency : తాడిపత్రిలో తాడో పేడో తేల్చుకునేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?

Tadpatri Assembly Constituency : తాడిపత్రిలో తాడో పేడో తేల్చుకునేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?
AP Latest News

Tadpatri Assembly Constituency(AP latest news):

ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టింది పేరు తాడిపత్రి. ఇక్కడ పొలిటికల్ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ వివాదాలు మొదలవుతాయో తెలియదు. అవి ఎటు దారి తీస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఓ రేంజ్ లో ఉంటూ వస్తున్నాయి. అది కాస్తా పొలిటికల్ యుద్ధాలకు దారి తీస్తూ వస్తోంది. ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి తాడిపత్రి సిద్ధమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో సున్నపురాయి గనులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి రెడ్డి సామాజికవర్గం నేతలదే హవాగా ఉంది. 1978 నుంచి రెడ్డి కమ్యూనిటీ నేతలే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు కూడా ఇదే సామాజికవర్గం నేతలను పోటీకి దింపుతున్నాయి. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్ రాజకీయంగా బలంగా ఉన్నారు. మరి తాడిపత్రి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

కేతిరెడ్డి పెద్దారెడ్డి (గెలుపు) VS జేసీ అస్మిత్ రెడ్డ


YCP 49%
TDP 45%
OTHERS 6%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. మొత్తం 49 శాతం ఓట్లు రాబట్టి విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేశారు. అయితే రాజకీయ అనుభవం అంతగా లేకపోవడంతో ఓడిపోయారు. కేవలం 45 శాతం ఓట్లు రాబట్టుకున్నారు. ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో తాడిపత్రి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కేతిరెడ్డి పెద్దారెడ్డి (YCP)

కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్లస్ పాయింట్స్

  • జనంలో కేతిరెడ్డికి సానుకూలత
  • ఐదేళ్లుగా నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్
  • నియోజకవర్గంలో పాదయాత్రలు
  • గడప గడప కార్యక్రమం సక్సెస్ చేయడం
  • పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడం

కేతిరెడ్డి పెద్దారెడ్డి మైనస్ పాయింట్స్

  • డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో జనానికి అవస్థలు
  • యాడికి సహా పలు మండలాలను కలిపే రోడ్లు అధ్వాన్నం
  • పత్తి రైతులకు సమస్యలు, తక్కువ ధరలు, దళారుల రాజ్యం

జేసీ అస్మిత్ రెడ్డి (TDP)

జేసీ అస్మిత్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • జేసీ బ్రదర్స్ రాజకీయ వారసత్వం
  • సెగ్మెంట్ రాజకీయాలను ప్రభావితం చేసే కెపాసిటీ
  • అస్మిత్ కంటే ఆయన తండ్రి తాడిపత్రిలో కీలకంగా ఉండడం

జేసీ అస్మిత్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో ఓడిపోయాక పెద్దగా కనిపించని పరిస్థితి
  • సెగ్మెంట్ లో కీలక నేతగా ఎదగలేకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

కేతిరెడ్డి పెద్దారెడ్డి VS జేసీ అస్మిత్ రెడ్డి

YCP 48%
TDP 46%
OTHERS 6%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడిపత్రిలో వైసీపీ గెలిచేందుకే స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థి 48 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఉండగా.. టీడీపీ అభ్యర్థికి 46 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.

వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓట్లు ఎక్కువగా వచ్చేందుకు ఆయన ఇమేజ్ కీలకంగా ఉపయోగపడుతోంది. 2019లో గెలిచిన తర్వాత మరింతగా సెగ్మెంట్ కే పరిమితం అవుతూ వచ్చారు కేతిరెడ్డి. గత ఎన్నికల్లో జగన్ వేవ్, వైసీపీ హవాతో కేతిరెడ్డికి రూట్ క్లియర్ అయినా ఇప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. పైగా జగన్ సర్కార్ స్కీములు కూడా చాలా వరకు ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థి ఉండడం కూడా కేతిరెడ్డికి కలిసి వచ్చేలా మారుతోంది. అటు టీడీపీ అభ్యర్థి ఓట్ షేర్ కు జేసీ ఫ్యామిలీ రాజకీయ వారసత్వం ఉపయోగపడుతోంది.

.

..

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×