E-Paper
Advertisement

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!
Advertisement

Durgam Cheruvu Closed:వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో దుర్గం చెరువు పబ్లిక్ తో కళకళ లాడిపోతుంటుంది. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో సరదాగా గడపడానికి చాలామంది అక్కడికి వెళ్తుంటారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దుర్గం చెరువు పరిసరాల్లో కనిపించే వాతావరణం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది అయితే దుర్గం చెరువు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారికి అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. రెండు రోజుల పాటు సందర్శకులకు అక్కడ ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు.

దుర్గం చెరువు పరిసరాల్లో ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనుల కారణంగా సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ప్రవేశాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు దుర్గం చెరువు సందర్శనకు అనుమతి ఉండదని చెప్పారు.

Advertisement

రెండు రోజులు అటు వైపు రావొద్దు

మాములుగా దుర్గం చెరువుకు ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులు వస్తూనే ఉంటారు. ఇక హైదరాబాద్ లో ఉండి కాస్త రిలాక్స్ అవ్వాలనుకునేవాళ్లు, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకునేవాళ్లు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలనుకునేవాళ్లకు ఇది ఫేవరెట్ స్పాట్‌ అనే చెప్పాలి. . దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి వెళ్లి ఇబ్బంది పడకుండా ఈ రెండు రోజులు అటు వైపు రావొద్దు అని తెలిపారు.

Advertisement

అభివృద్ధి పనులు జరుగుతుండటంతో

ముఖ్యంగా సాయంత్రం వేళ దుర్గం చెరువు ప్రాంతానికి వెళ్లే వారి సంఖ్య ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సెలవు రోజు అయితే ఇంకా రద్దీ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో సందర్శకులు అక్కడికి వస్తే పనులకు ఇబ్బంది కలగడంతో పాటు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పనులు పూర్తయ్యేలా ప్రవేశాన్ని రెండు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పనులు పూర్తైన తర్వాత

ఈ విషయాన్ని అధికారులు ప్రజలకు ముందుగానే తెలియజేస్తూ.. దుర్గం చెరువు వద్దకు రావద్దని కోరారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా సహకరించాలని సూచించారు. మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ప్రజలు కొంత ఓపిక పట్టాలని, పనులు పూర్తైన తర్వాత సాధారణంగా సందర్శకులను అనుమతించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ALSO READ:పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

మొత్తానికి హైదరాబాద్‌లో దుర్గం చెరువు సందడి రెండు రోజుల పాటు ఆగనుంది. మరమ్మతులు, అభివృద్ధి పనుల కారణంగా ఈరోజు, రేపు సందర్శకులకు ప్రవేశం ఉండదు. పనులు సురక్షితంగా, వేగంగా పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. దుర్గం చెరువుకు వెళ్లాలని అనుకునే వారు రెండు రోజుల తర్వాత తమ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Tags

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×