E-Paper
Advertisement

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం
Advertisement

Inzamam-ul-Haq On Sachin:  టీమిండియా దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతిపిన్న వయసులోనే టీమిండియాలోకి వచ్చిన సచిన్ టెండూల్కర్… టన్నులకొద్దీ పరుగులు చేశాడు. అర్థ సెంచరీలతో పాటు సెంచరీలు నమోదు చేసి.. ఎన్నో రికార్డులు సృష్టించాడు. చాలా మ్యాచులలో జట్టును ముందుండి నడిపించి గెలిపించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ పైన మ్యాచ్ అంటే సచిన్ టెండూల్కర్ కు మంచి ఊపు వస్తుంది. అలాంటి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ బ్యాటర్ గానే కాకుండా బౌలర్ గా కూడా అద్భుతంగా రాణించేవాడని గుర్తు చేశాడు. షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

సచిన్ టెండూల్కర్ బౌలింగ్ పై ఇంజమామ్ ఉల్ హ‌క్ (Inzamam ul Haq) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటర్ గానే కాకుండా ఒక అద్భుతమైన పార్ట్ టైం బౌలర్ గా టీమిండియాకు అతడు ఎంతో సేవలు చేశాడని ప్రశంసించారు. అతని బౌలింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని వెల్లడించారు. మ్యాజిక్ ఆర్మ్ అంటూ అతడిని పిలిచే వాళ్ళమని వివరించారు. టీమిండియాకు వికెట్ కావాలన్నప్పుడల్లా… సచిన్ టెండుల్కర్ ను ఆ జట్టు వాడుకునేదని వివరించారు. ఆ సమయంలో కచ్చితంగా సచిన్ టెండూల్కర్ వికెట్ తీసి… టీమిండియాకు ఊపిరి పోసేవాడని కొనియాడారు.

Advertisement

లెగ్ స్పిన్ వేయడంలో సచిన్ టెండూల్కర్ ను మించిన వాళ్లు ఎవరూ లేరన్నారు. తనను దాదాపు 8 సార్లు సచిన్ టెండూల్కర్ అవుట్ చేసినట్లు గుర్తు చేశారు ఇంజమామ్ ఉల్ హ‌క్. షేన్ వార్న్, మురళీ ధరన్ ( Mutthaiah Muralidharan) కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌నే 8 సార్లు ఔట్ చేశాడని తెలిపారు. స‌చిన్ ( Sachin) బౌలింగ్ ఎదుర్కొవాలంటే గ‌ట్స్ ఉండాలని తెలిపారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

స‌చిన్ టెండూల్క‌ర్ బౌలింగ్ గ‌ణాంకాలు

Advertisement

బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ అదరగొడుతున్నాడు. గోల్డెన్ ఆర్మ్ గా పేరు గాంచిన సచిన్ టెండూల్కర్ వన్డేలలో ఇప్పటివరకు 154 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 32 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదే అతని కెరీర్ బెస్ట్. టెస్టుల్లో ఇప్పటివరకు 46 వికెట్లు పడగొట్టాడు. టి20 లలో ఒకే వికెట్ పడగొట్టాడు. మొత్తంగా 201 వికెట్లు పడగొట్టాడు సచిన్ టెండూల్కర్.

 

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

 

Related News

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

Big Stories

Advertisement
×