E-Paper
Advertisement

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?
Advertisement

Panchayat Bill: ఉప సర్పంచ్ ల చెక్ పవర్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు..పట్నాలకు పోయినా పల్లెలు పిలుస్తూనే ఉంటాయని, పల్లెకు పోతే తల్లి ఇంటికి పోయినంత సంతోషంగా ఉంటుందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70 లోని సబ్ సెక్షన్ 3 కు సవర‌ణ చేస్తూ బిల్లును ప్ర‌వేశ పెట్టి మాట్లాడారు. గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బు గ్రామ అభివృద్ధికే ఉపయోగపడాలని,గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం గ్రామ అవసరాలకు అందుబాటులో ఉండాలని, నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని, ఇదే మా ప్రజా ప్రభుత్వ విధానం అన్నారు.

73వ రాజ్యాంగ సవరణ..

మన దేశంలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారని, గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే సంస్థలుగా కాకుండా.. ప్రజలకు దగ్గరగా ఉండే స్వయం పాలనా సంస్థలుగా పనిచేయాలన్నదే దాని ప్రధాన ఉద్దేశం అన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలతో పాటు వాటికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా ఉండాలని, అందుకే పంచాయతీలకు కొన్ని పన్నులు, సుంకాలు, ఫీజులు వసూలు చేసుకునే అధికారాలను కూడా కల్పించారన్నారు.

జీపీల‌కు ఆదాయం..

Advertisement

గ్రామ పంచాయతీలకు రోడ్లు నిర్మించడం, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం, పారిశుధ్యం నిర్వహించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా వంటి అనేక ప్రాథమిక పౌర సేవల బాధ్యతలు ఉన్నాయన్నారు. జీపీల‌కు ఆదాయం సమకూర్చుకునే అధికారం ఇచ్చి.. ఆ ఆదాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకునే స్వేచ్ఛ లేకపోతే స్థానిక స్వపరిపాలన ఎలా బలపడుతుంది? అందుకే ఈ సవరణను తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే నిధులను ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వస్తోందని, ఆ తర్వాత గ్రామ అవసరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలంటే ట్రెజరీ ద్వారా నిధులను డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

Also read: డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

బ్యాంకు ఖాతాలో జ‌మ..

Advertisement

దీనికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుందని, అవసరమైన పత్రాలు, అనుమతులు, ఇతర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల కొన్నిసార్లు నిధుల వినియోగంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. గ్రామంలో సమస్య వస్తుందని కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన డబ్బు అందుబాటులోకి రావడానికి ఎందుకు ఆలస్యం కావాలి? ఒక గ్రామంలో డ్రైనేజీ సమస్య వచ్చింది అనుకోండి..తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు చేయాలి.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలి..పారిశుధ్య పనులు చేపట్టాలి.. చిన్నచిన్న అత్యవసర పనులు చేయాలి పంచాయతీ దగ్గర సొంత ఆదాయం ఉన్నప్పటికీ, ఆ డబ్బును వినియోగించుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు.. అందుకే పంచాయతీకి వచ్చిన సొంత ఆదాయం.. పంచాయతీ అవసరాలకు సకాలంలో అందుబాటులో ఉండాలి. అందుకే కేంద్ర,రాష్ట్ర ఫైనాన్సు క‌మిష‌న్ నిధుల‌ను బ్యాంకు ఖ‌తాల్లో జ‌మ అయిన‌ట్లుగానే.. జీపీ సొంత ఆదాయం కూడా బ్యాంకు ఖాతాలో జ‌మ అయ్యేలా చ‌ట్టాన్ని స‌వ‌రిస్తున్నామని వెల్లడించారు.

రూ.619 కోట్లు..

గ్రామ స‌భ తీర్మాణం మేర‌కు అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేసుకోవచ్చు అన్నారు. ట్రెజ‌రీ వ‌ల్ల నిధులు స‌కాలంలో అంద‌డం లేదని తెలిపారు. మున్సిపాలిటీల్లో సొంత ఆదాయాన్ని జీపీ బ్యాంకు ఖాతాల్లో వేసుకోవ‌చ్చుకానీ పంచాయ‌తీల‌కు ఆ వెసులు బాటు లేదు.. పంచాయ‌తీల మీద గ‌త ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిందన్నారు. దాన్ని రూపుమాప‌డానికి చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తున్నామని తెలిపారు. ప్ర‌తి నెల జీపీల కోసం రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. 2025-26 ఏడాదికి సంబ‌ధించి సెకంట్ ఇన‌స్టాల్ మెంట్ రూ.619 కోట్లు రావాల్సి ఉందన్నారు. మొద‌టి తారిఖునాడే మల్టి ప‌ర్ప‌స్ వ‌ర్క‌ర్ల‌కు జీతాలు ఇస్తున్నామన్నారు. కేంద్రం నూతన విధానాల కారణంగా.. గ్రామాల ఆభివృద్దిపై ప్రభావం చూపుతోందన్నారు.

Also read: ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

డబుల్ రోడ్లు..

వీబీజీ రాంజీతో రాష్ట్రాలపై రూ. 2 వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అయినా మేము పెద్ద ఎత్తున వీబీ జీ రాంజీ పనులు చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంట కుంట, ఊరికి ఉట కుంటను నిర్మిస్తున్నామని, ప్రతి గ్రామానికి పక్కా రహదారి ఉండాలని సీఎం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు ఇస్తున్నామని, హ్యమ్ విధానంలో వేల కీలోమీటర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఫారెస్టు ప్రాంతాల్లో కేంద్ర అటవి చట్టాలు రోడ్ల నిర్మానానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని, దీంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఇప్పించాలని కోరారు.

పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70 లోని సబ్ సెక్షన్ 3 కు సవర‌ణ బిల్లును గురువారం అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అధికార , ప్రతిపక్ష సభ్యులు మాట్లాడి బిల్లుకు మద్దతు తెలిపారు. ఏకగ్రీవంగా సభ్యులు మద్దతు తెలపడంతో స్పీకర్ బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. అదే విధంగా పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు శాసనమండలి సైతం ఏకగ్రీవంగా సభ్యులు మద్దతు తెలిపారు.

Also read: స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

Tags

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×