Ruturaj Gaikwad Comments on CSK Defeat: నిజానికి పిచ్ సెకండాఫ్ స్పిన్ కి తిరిగిందని, అందుకే ఫస్ట్ ఓవర్ మ్యాక్స్ వెల్ వేశాడని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నేను డక్ అవుట్ కావడం ఊహించలేదని అన్నాడు. ఈసారి మ్యాచ్ లో చాలా బాడ్ ఫ్యాక్టర్స్ పనిచేశాయని తెలిపాడు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర రన్ అవుట్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు.
గత ఏడాది 2023 లో ఫైనల్స్ విజేతగా నిలిచాం. అప్పుడు కూడా ఆఖరి రెండు బాల్స్ కి 10 రన్స్ చేయాలి. రవీంద్ర జడేజా ఒక ఫోర్, సిక్స్ కొట్టి విజేతగా నిలిపాడు. ఇప్పుడు కూడా లాస్ట్ 2 బాల్స్ కి 9 పరుగులు చేయాల్సి వచ్చింది. అటువైపు రవీంద్ర స్ట్రయికింగ్ లో ఉన్నాడు. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించామని తెలిపాడు. కానీ ఈసారి కుదరలేదని తెలిపాడు.
ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లను కొద్ది పరుగుల తేడాలో చేజార్చుకున్నాం. అందులో ఒకటి గెలిచినా, ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నాడు. 14 మ్యాచ్ ల్లో 7 గెలిచినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. అయితే కొన్ని మ్యాచ్ లకు కీలకమైన బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో లేరని తెలిపాడు.
Also Read: రిటైర్మెంట్ తర్వాత నేను ఎవ్వరికి కనిపించను.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
డేవన్ కాన్వే, పతిరణ, ముస్తాఫిజుర్ వీరు రకరకాల కారణాలతో ఆడలేదు. దీంతో మ్యాచ్ సమతూకం దెబ్బతిందని అన్నాడు. వారిని రీప్లేస్ చేయడం కుదరలేదని తెలిపాడు. ఇవీ లోపాలని చెప్పలేను, ఓటమికి సాకులు వెతకలేను, కానీ మాకు ఎదురైన అనుభవాలు ఇవని తెలిపాడు.
ఈ సీజన్ లో 583 స్కోరు చేయడం ఆనందంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం కొహ్లీ (708) తర్వాత తనే నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదని తెలిపాడు. నా రికార్డ్స్ కన్నా జట్టు గెలిస్తే, ఆ వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ చివరి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగు చేశాడు. మేం ఇంతవరకు ప్రయాణం చేయడం వెనుక సీఎస్కే స్టాఫ్ కృషి ఎంతో ఉంది. వారికి ధన్యవాదాలని తెలిపాడు.