kanthara Fame Sapthami Gowda: కన్నడ సినిమా ‘కాంతార’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒక చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయింది. ఆ తర్వాత సినిమా రెస్పాన్స్‌ను బట్టి ఇతర భాషల్లో రిలీజ్ చేయగా రికార్డుల వర్షం కురిపించింది.
అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కన్నడ బ్యూటీ సప్తమి గౌడ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ హూదా సంపాదించుకుంది. కాంతారలో ఆమె నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్‌గా సప్తమి గౌడ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.
దీనిపై మేకర్స్ నుంచి త్వరలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.