E-Paper
Advertisement

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!
Advertisement

Rekha Naik: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఈడీ సోదాల కలకలం మొదలైంది. రూ.40.96 కోట్ల ప్రభుత్వ వరి కుంభకోణం కేసులో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు ED గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఇల్లు, రైస్ మిల్లులో ఏకకాలంలో తనిఖీలు

Advertisement

కేవలం రేఖా నాయక్ నివాసంలోనే కాకుండా, ఆమెకు సంబంధించిన ARS ఇండస్ట్రీస్ రైస్ మిల్లులోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఉదయం నుంచే అధికారులు రంగంలోకి దిగారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.30 లక్షల నగదుతో పాటు, కేసుకు అత్యంత కీలకమైన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అసలు కేసు ఎలా మొదలైందంటే?

Advertisement

ప్రభుత్వ వరి ధాన్యం సేకరణ , మిల్లింగ్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తొలుత ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 316(2), 316(5), 318(4)తో కేసు నమోదు చేశారు. దీంతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం

ఖానాపూర్ పోలీసుల ఎఫ్ఐఆర్‌ను ఆధారంగా చేసుకున్న ఈడీ, ఇందులో భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా జరిగిన సోదాల్లో రూ.30 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు చిక్కాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

Tags

Related News

నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

గాంధీభవన్‌లో హైటెన్షన్.. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ కీలక భేటి.. బహిరంగ వ్యాఖ్యల నేతలకు చెక్ పడేనా?

గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌తో కొత్త వెలుగులు

Big Stories

Advertisement
×