E-Paper
Advertisement

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!
Advertisement

Triple Talaq Case: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ట్రిపుల్ తలాక్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొడుకు కావాలన్న కారణంతో ఇద్దరు కుమార్తెలు ఉన్న భార్యకు ఓ భర్త ఏకంగా ఫోన్ మెసేజ్ ద్వారా మూడుసార్లు తలాక్ చెప్పి వదిలేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

సైదాబాద్‌లోని లోకాయుక్త కాలనీకి చెందిన నిషాంత్ ఆఫ్రీన్ (37), మహమ్మద్ అతి అర్ఫత్ (40)లకు 2015 ఆగస్టులో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కుటుంబ వివాదాలు మొదలయ్యాయి. ఈ గొడవలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇప్పటికే పలు కేసులు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

కేసులపై ఒత్తిడి.. ఆపై తలాక్!

Advertisement

వివాదాలు కొనసాగుతున్న క్రమంలోనే గత నెల 24న భర్త మహమ్మద్ అతి అర్ఫత్ తన భార్యకు ఫోన్ చేశాడు. డిసెంబర్ లోగా తనపై ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఒకవేళ కేసులు ఉపసంహరించుకోకపోతే వదిలేస్తానంటూ హెచ్చరించాడు. అన్నట్లుగానే మరుసటి రోజే తన భార్యకు ఫోన్‌లో ‘ట్రిపుల్ తలాక్’ చెబుతూ మెసేజ్ పంపాడు.

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’

భర్త పంపిన మెసేజ్ చూసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. ‘నువ్వు నాకు నచ్చడం లేదు. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు’ అంటూ అతను సందేశం పంపినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్త సహనా బేగం, ఆడపడుచు అరియా ప్రేరేపించడం వల్లే తన భర్త ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని ఆమె ఆరోపించింది.

Advertisement

Also Read: రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

పోలీసులకు ఫిర్యాదు

చట్టవిరుద్ధంగా ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి తనకు, తన ఇద్దరు ఆడపిల్లలకు అన్యాయం చేశాడంటూ బాధితురాలు నిషాంత్ ఆఫ్రీన్ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Also Read: కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!

Tags

Related News

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

గాంధీభవన్‌లో హైటెన్షన్.. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ కీలక భేటి.. బహిరంగ వ్యాఖ్యల నేతలకు చెక్ పడేనా?

గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌తో కొత్త వెలుగులు

ప్రతి హిందూ ఇంట్లో తుపాకీ ఉండాలి.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం!

ఓయు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..?

Big Stories

Advertisement
×