TPCC PAC Meet: కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తున్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ బి.ఎం. సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
ఈ పీఏసీ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వంపై, సీఎం తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది దుర్మరణం!
పార్టీ క్రమశిక్షణ, నేతల బహిరంగ వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో నేటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.మరోవైపు ఇన్‌ఛార్జ్ సందీప్ నవంబర్ 23 నకూడా హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండనున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమై, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించనున్నారు.
Also Read: చలికాలంలో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? ఉదయాన్నే టీ తాగే ముందు ఈ స్పైసీ డ్రింక్ తాగండి చాలు