E-Paper
Advertisement

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!
Advertisement

HYDRAA Ranganath: రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా (Hydraa) చుట్టూ గత కొంతకాలంగా రాజకీయ వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్ ఇంటర్వ్యూ’లో హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. బిగ్ టీవీ సీఓఓ, యాంకర్ రూప అడిగిన సూటి ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. జనాలు మొదట్లో హైడ్రా అంటే ఒక కూల్చివేత సంస్థగా చూశారని.. ప్రస్తుతం హైడ్రా మీద ప్రజల ఉద్దేశం మారిందని ఈ ముఖాముఖీలో రంగనాథ్ అన్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణ భారీగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. కబ్జాదారులను ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు.

హైడ్రాకు బీజం ఎప్పుడు పడిందనే ప్రశ్నకు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా ఏర్పాటుపై స్పష్టత ఉందని రంగనాథ్ చెప్పారు. ‘చెరువుల ఆక్రమణ, పార్కుల ఆక్రమణ అన్నింటికీ చెక్ పెట్టాలంటే ఒక సంస్థను తీసుకురావాలి. మొదటి నుంచి రేవంత్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు కాబట్టి మంచి అవగాహన ఉంటుంది. ఒక స్పష్టతతోనే హైడ్రా రూపొందించారు’ అని రంగనాథ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే రంగనాథ్ ను జైల్లో పెడతాముంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హెచ్చరికలపై కూడా రంగనాథ్ స్పందించారు. చెరువులను కాపాడి, కబ్జాలను ఆపినందుకు తనను జైలులో పెడతారా? అని ప్రశ్నించారు.

Advertisement

రాజకీయ వ్యాఖ్యలు, అంశాల విషయంలో హైడ్రా ఎట్టిపరిస్థితుల్లో తలదూర్చదని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రజల ఆస్తిని తిరిగి ప్రజలకు ఇవ్వాలన్నదే తమ అంతిమ లక్ష్యమన్నారు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యలపై స్పందించడం తనకు ఇష్టం లేదని బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్ లో రంగనాథ్ తెలియజేశారు. మరోవైపు ఆరంభం నుంచి చాలా మంది విద్యావంతులు, మధ్యతరగతి వాళ్లు హైడ్రాను సమర్థించారని రంగనాథ్ అన్నారు. అయితే అవగాహన లేని వర్గాలు, పేదవాళ్లు మాత్రమే హైడ్రా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారన్నారు. తమ ఉద్దేశాలపై వాళ్లలో కన్ఫ్యూజన్ ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. .

ఐపీఎస్ గా ఉన్న తనను హైడ్రా కమిషనర్ గా నియమించడంపై కూడా రంగనాథ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైడ్రా చీఫ్ పదవికి ముందు తాను తెలంగాణ సెంట్రల్ జోన్ అడిషనల్ సీపీగా పనిచేసినట్లు చెప్పారు. ఆ జోన్ పరిధిలో చాలా జిల్లాలు ఉన్నాయన్నారు. సీనియర్ ఆఫీసర్లు ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫీడ్ వల్ల, అలాగే వరంగల్ సీపీగా ఉన్నప్పుడు భూముల సంబంధ వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించడంతో తనకు హైడ్రా చీఫ్ గా రేవంత్ అవకాశం ఇచ్చి ఉండచ్చేమో అని రంగనాథ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Also Read: ‘నన్ను చంపాలని చూస్తున్నారు’.. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు!

సినీ నటుడు నాగార్జున, తుమ్మిడికుంట చెరువు ఆక్రమణ అంశంపై కూడా రంగనాథ్ స్పందించారు. నాగార్జున ముందుకు వచ్చి రూ.400 కోట్ల విలువైన భూమిని అప్పగించారన్నారు. కేసులన్నీ ఉపసంహరించుకొని మరి సహకరించారని చెప్పారు. దానికి ఆయనను అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తుమ్మిడికుంట చెరువు పునః ప్రారంభోత్సవం సందర్భంగా నాగార్జునను ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు. పుణేలో షూటింగ్ లో ఉండి కూడా.. స్పెషల్ ఫ్లైట్ లో ఆయన బయలుదేరి కార్యక్రమానికి వచ్చారని ప్రశంసించారు. రంగనాథ్ చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Also Read: Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Tags

Related News

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

గాంధీభవన్‌లో హైటెన్షన్.. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ కీలక భేటి.. బహిరంగ వ్యాఖ్యల నేతలకు చెక్ పడేనా?

గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌తో కొత్త వెలుగులు

ప్రతి హిందూ ఇంట్లో తుపాకీ ఉండాలి.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం!

ఓయు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..?

జహీరాబాద్ ప్రభుత్వ నిమ్జ్ భూముల్లో ఎర్ర రాళ్ల దందా..!

ఉప్పల్ హెరిటేజ్ ఫుడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో మహిళ మృతి!

Big Stories

Advertisement
×